నాని నటించిన సినిమాలన్నీ అభిమానులకు ఎంతగానో ఇష్టం. అందులో జెర్సీ సినిమా ఒకటని చెప్పవచ్చు. ఈ సినిమాను అయితే ప్రత్యేకించి యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడతారు. నాని లోని సరికొత్త నటుడిని ఈ సినిమాలో మనం చూడవచ్చు. గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో హీరోగా నాని క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్ర సంగీతాన్ని అందించారు. కాగా ఈ సినిమా తెలుగు తమిళ్ మలయాళం కన్నడలో భాషలలో విడుదలైంది. 2019 ఏప్రిల్ 19 లో రిలీజ్ అయిన ఈ సినిమా రూ. 30 కోట్ల కలెక్షన్లను రాబట్టింది.
ఈ సినిమాలో నాని నటన సెంటిమెంట్ పెద్దగా వర్కౌట్ కాలేదు. ఈ సినిమాని రూ. 25 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. కానీ ఈ సినిమాకు రూ. 30 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. ఈ సినిమా థియేటర్ల వద్ద యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఒక ప్రేమికుడిగా అతని జీవితంలో ఏదైనా సాధించాలి అని తపనతో తన కొడుకు పుట్టినరోజుకి రూ. 500 కూడా లేని నిస్సహాయ తండ్రిగా నాని ఉన్నారు. తన భార్య సంపాదించి లాగిపెట్టి చెంప పైన కొట్టిన ఏమీ అనకుండా సైలెంట్ గా బాధతో భరించి గుండెలు పగిలే బాధను తన మనసులోనే దాచుకొని తనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో నాని చూపించారు.
క్రికెటర్ అర్జున్ గా కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ తో అదరగొట్టారు. లంచం తీసుకున్నాడని అనుమానంతో నాని ఉద్యోగం పోగొట్టుకోగా.... తిరిగి అదే లంచంతో ఉద్యోగం సంపాదించడం అసలు ఇష్టం లేక తన వ్యక్తిత్వాన్ని చంపుకోలేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వచ్చిన సన్నివేశాలు ఈ సినిమాలో ఎన్నో ఉన్నాయి. ఈ సినిమాతో నాని అభిమానులను పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. అనంతరం నాని నటించిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి.