అయితే 2016లో సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కేపీ చౌదరి కబాలి అనే సినిమా తెలుగు వర్షన్ కి సైతం నిర్మాతగా ఉన్నారట. తెలుగు, తమిళంలో కూడా చాలా సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరించినట్లు సమాచారం. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సర్దార్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాలకు కూడా కేపీ చౌదరి డిస్ట్రిబ్యూటర్ గా చేసిన పెద్దగా కలిసి రాలేదట. అలా డిస్ట్రిబ్యూటర్ గా నష్టాలను చవిచూసిన కేపీ చౌదరి ఆ నష్టాలను సైతం పూడ్చుకోవడానికి డ్రగ్స్ లోకి దిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
అలా గోవాలో OHM అనే పబ్బును కూడా మొదలు పెట్టారట. అక్కడ గోవాకి వచ్చిన సెలబ్రిటీలకు కూడా సరఫరా డ్రగ్స్ చేసేవారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నిర్మాతతో చాలామంది సెలబ్రిటీలకు కూడా సన్నిహిత్యం ఉన్నదని పబ్బు బిజినెస్లలో కూడా నష్టాలు రావడంతో తిరిగి మళ్లీ హైదరాబాద్కే వచ్చారట నిర్మాత కె.పి చౌదరి. అయితే అలా వస్తూ వస్తూ గోవా నుంచి ఒక 100 ప్యాకెట్ల కొకైను కూడా తీసుకువచ్చారని గతంలో ఎక్కువగా వార్తలు వినిపించాయి. చాలామంది సినీ సెలబ్రిటీలతో హగ్గులు ముద్దులు వంటిది చేసినట్లుగా కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారాయి. నిర్మాత కె.పి చౌదరి మరణ విషయంపై కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇచ్చారట గోవా పోలీసులు.