కొన్ని సినిమాలు థియేటర్లోకి వచ్చిన సమయంలో ఎవరూ పట్టించుకోరు.కానీ అవే మళ్ళీ టీవీలలోకి వచ్చిన సమయంలో మాత్రం వారి మనసుకు ఎంతగానో దగ్గరవుతాయి. అయితే అలాంటి సినిమాలలో సూర్య సన్నాఫ్ కృష్ణన్ కూడా ఒకటి... ఎప్పుడో 17 సంవత్సరాల క్రితం విడుదలైన సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా విడుదలైన సమయంలో అట్టర్ ప్లాప్ అయ్యి రీ రిలీజ్ లో మాత్రం సరికొత్త ట్రెండ్ సృష్టించింది. మరి ఈ సినిమా ఫ్లాప్ కి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.. గౌతమ్ మీనన్ వాసుదేవ్ డైరెక్షన్లో నటుడు సూర్య హీరోగా సిమ్రాన్, సమీరా రెడ్డిలు హీరోయిన్ లుగా వచ్చిన సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమా లో సూర్య డ్యూయల్ రోల్ లో నటించారు. కృష్ణన్ అనే తండ్రి పాత్రలో సూర్య అనే కొడుకు పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా కోసం సూర్య డెడికేషన్ వేరే లేవల్ అని చెప్పుకోవచ్చు.

 ఎందుకంటే తండ్రి పాత్ర కోసం ముందుగా వేరే హీరోల్ని అనుకున్నప్పటికీ నేనే చేస్తాను అని సూర్య ముందుకు వచ్చారట. అలా తండ్రి పాత్రలో నటించడం కోసం 15 కిలోల వెయిట్ తగ్గారట.ఆ తర్వాత ఆర్మీలో జాయిన్ అయినా సమయంలో కొడుకు పాత్రలో నటించడం కోసం మళ్లీ 15 కిలోల వెయిట్ పెరిగారట. అలా ఈ సినిమా కోసం సూర్య డెడికేషన్ కి అప్పట్లో చాలామంది ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా కూడా చాలా బాగుంది. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో వచ్చినా కూడా ఎంతో మంది ఇష్టంగా చూస్తారు. కానీ ఈ సినిమాని థియేటర్లో ఎందుకు ఫ్లాప్ చేశారో మాత్రం ఇప్పటికీ అర్థం కాదు.

అయితే ఈ మధ్యకాలంలో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తోంది.  బ్లాక్ బస్టర్ హిట్స్ అయిన సినిమాలు లేదా డిజాస్టర్ అయిన సినిమాలను మళ్లీ రీ రిలీజ్ లు చేస్తున్నారు మేకర్స్.అలా రీ రిలీజ్  ల ట్రెండ్ లో భాగంగా సూర్య నటించి అట్టర్ ప్లాప్ అయినా సూర్య సన్నాఫ్ కృష్ణన్ అనే సినిమాని రీ రిలీజ్ చేయగా మొదటి రోజే కోటి రూపాయల గ్రాస్ అందుకున్న సినిమా లిస్టులో చేరిపోయి సంచలనం సృష్టించేది. అలా ఈ సినిమా మొదటిసారి విడుదలైన సమయంలో ఫ్లాప్ టాక్ తెచ్చుకొని రీ రిలీజ్ లో మాత్రం సరికొత్త ట్రెండ్ సృష్టించింది అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: