రవితేజ కెరీర్ ను మలుపు తిప్పేసిన ‘ఇడియట్’ సినిమాని ఎవ్వరూ మర్చిపోరు. ఒక విధంగా రవితేజకు లైఫ్ ఇచ్చిన సినిమా ఇది. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ రక్షిత కూడా అందరినీ అట్రాక్ట్ చేసింది. ఆ వెంటనే ‘పెళ్ళాం ఊరెళితే’ వంటి సూపర్ హిట్ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. వెంటనే మహేష్ తో ‘నిజం’ అనే సినిమాలో నటించింది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా అగ్ర హీరోగాలైన.. నాగార్జునతో ‘శివమణి’, ఎన్టీఆర్ తో ‘ఆంధ్రావాలా’, చిరంజీవి తో ‘అందరివాడు’ వంటి చిత్రాలు చేసే అవకాశాలు దక్కించుకుంది. అయితే తరువాత ఆఫర్లు పెద్దగా రావకపోవడంతో కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ కొన్ని చిత్రాలు చేసింది.అదే సమయంలో కన్నడలో కూడా స్టార్ హీరోలకు జోడీ కట్టి దక్షణాది బిజీగా స్టార్ గా ఓ వెలుగుతూనే ఓ కన్నడ దర్శకుడిని పెళ్లి చేసుకొని సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసింది.అయితే.. ఒకనాడు కుర్రాళ్లకు కలలరాణిగా వెలిగిన రక్షిత ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఓ బాబుకి జన్మనిచ్చిన అనంతరం బరువు పెరిగిన రక్షిత ఇప్పుడు అసలు ఏ మాత్రం పోల్చుకోలేని స్థితిలో బరువు పెరిగిపోయింది. థైరాయిడ్ కారణంగానే బరువు పెరిగినట్లు ఆ మధ్య ఓ రియాల్టీ షోలో చెప్పుకొచ్చిన రక్షిత కరోనా లాక్ డౌన్ తర్వాత విపరీతంగా బరువు పెరిగిపోయినట్లు తెలుస్తుంది. కాగా.. రక్షిత షాకింగ్ లుక్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది.ఇడియట్ నాటి హీరోయిన్.. ఇప్పుడు రక్షిత ఫోటోలను పోల్చి చూస్తున్న అభిమానులు దర్శకుడు పూరి జగన్నాద్ పోడ్ కాస్ట్ కామెంట్స్ గుర్తు చేసుకుంటున్నారు. పూరి ఈ మధ్యనే పోడ్ కాస్ట్ లో హీరోయిన్స్ మీద ఆసక్తికర కామెంట్స్ చేశాడు. హీరోయిన్స్ అంటే ప్రేక్షకుల దృష్టిలో దేవతలుగా ఉంటారని.. అలాంటి దేవతలు కూడా పెళ్లిళ్లు చేసుకొని.. పిల్లల్ని కనేసి మనుషులుగా మారిపోవడం ఏ మాత్రం సమంజసం కాదని కామెంట్స్ చేశారు. దీంతో పూరి తెలుగు సినిమాకు పరిచయం చేసిన రక్షితనే ఉదాహరణగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: