టాలీవుడ్ సినీయ‌ర్‌ హీరో విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హీట్ గా టాలీవుడ్ బాక్సాఫీస్ చరిత్రలోనే మెమొరబుల్ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కనుకగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ కలెక్షన్లను కొల్లగొడుతుంది .. ఇప్పటివరకు ఈ సినిమా 303 కోట్ల గ్రాస్ తో ప్రపంచవ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ మార్కును దాటిన తొలి తెలుగు ప్రాంతీయ సినిమాగా ఇండియన్ సినిమా చరిత్రలో తన పేరును లిఖించుకుంది ..


సీనియర్ హీరోలలో 300 గ్రాస్ కలెక్షన్స్ తో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు వెంక‌టేష్‌. నెటితో ఈ సినిమా నాలుగో వారంలో అడుగు పెట్టినప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ  కామెడీ బావ్వో ద్వేగం మరియు సాపేక్షమైన కథనాన్ని మిళితం చేసి ప్రేక్షకులను మెప్పించే కథలు రాయటంలో అనిల్ రావిపూడి యొక్క నేర్పు మరోసారి ఫలించింది. అలాగే అటు నిర్మాతలు ఇటు డిస్ట్రిబ్యూటర్లు , ఎగ్జిబిటర్లు అందరూ భారీ స్థాయిలో తెలుగు సినిమా చ‌రిత్ర‌ల్లో ఎప్పుడు చూడని అత్యంత లాభాలు తెచ్చిన సినిమాల్లో ఒకటిగా సంక్రాంతికి వస్తున్నాం  రికార్డుకు ఎక్కింది.


ఇక  ఈ సినిమా ఎన్నో ప్రాంతాల్లో స్టార్ హీరోలు పాన్‌ ఇండియా సినిమాల కలెక్షలను సైతం దాటేసింది .. ప్రస్తుతం నడుస్తున్న ఈ పాన్‌ ఇండియా సినిమాల క్రేజ్‌లో ఒక ప్రాంతీయ సినిమా 300 కోట్ల కలెక్షన్ల మైలు రాయిని చేరుకోవటం అసాధారణమైన విజయం .. ఇక దీన్ని సుసాధ్యం చేసి చూపించాడు వెంకటేష్ .. అక్కడ ఇక్కడ అని ఎక్కడ తేడా లేకుండా సంక్రాంతికి వస్తున్నాం అన్ని చోట్ల లాభాల పంట పండించింది .. ఫైనల్ రన్ లో ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో అనేది కూడా ట్రేడ్ వర్గాలు కూడా చెప్పలేకపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: