బాలీవుడ్లో మలైకా ఆరోరా, అర్జున్ కపూర్ ప్రేమాయణం బ్రేకప్ గురించి గ‌త‌ కొంతకాలంగా సోషల్ మీడియాలో , రీజినల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి .. ఈ బ్రేక్ బ్రేకప్ గురించి అందరికి తెలిసిన విషయమే .. అయితే ప్రస్తుతం తాను సింగిల్ గా ఉన్నానని గతంలో ప్రకటించిన అర్జున్ ప్రియురాలు , మలైక నుంచి బ్రేకప్ చెప్పిన కొన్ని నెలల తర్వాత తన పెళ్లి ఫ్యామిలీ లైఫ్ గురించి తన ప్రణాళికలను చెప్పుకొచ్చాడు. అర్జున్ కపూర్ నటించిన తాజా మూవీ మేరే హస్బెండ్ కి బివి .. ప్రమోషన్ లో భాగంగా అర్జున్ తన మనసులోని బాధను పైకి చెప్పేసాడు .. తాజాగా జరిగిన ఓ ప్రమోషనల్ ఈవెంట్లో ఈ బాలీవుడ్ హీరో రియల్ లైఫ్ పెళ్లి ఆలోచన గురించి చెప్పుకొచ్చాడు ..


పెళ్లి అనేది ఎప్పుడు జరుగుతుందో మీ అందరికీ తెలియజేస్తాను ఈరోజు సినిమా గురించి మాత్రమే మాట్లాడుతాను అని అక్కడ అన్నాడు .. నేను సుఖంగా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం గురించి ముచ్చటించుకుందాం .. ప్రస్తుతం సినిమా గురించి మాత్రమే నేను చెప్పుకురావాల్సిన అవసరం ఉంది అంటూ అర్జున్ అక్కడ మీడియా వాళ్ళతో ముచ్చటించారు. తగిన సమయం వచ్చినప్పుడు పెళ్లి గురించి మీ అందరికీ చెబుతా .. అంటూ అర్జున్ త‌న‌ మాటలను ముగించాడు .. రీసెంట్ గానే అర్జున్ మలైకా అరోరా నుంచి విడిపోయినట్లు ప్రకటించాకా వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలిచాడు ..


అలాగే రాజ్ థాకరే నిర్వహించిన దీపావళి పార్టీలో తాను ఇప్పుడు ఒంటరిగా ఉండాలని కూడా చెప్పుకొచ్చాడు అది జాతీయస్థాయిలో కూడా హట్ టాపిక్‌గా మారింది. అర్జున్ కపూర్ నటించిన మేరే హస్బెండ్ కి బీవి సినిమా పోస్టర్లు , పాటలు కూడా బాగున్నాయి .. ఇద్దరు అమ్మాయిల మధ్య నలిగిపోతున్న అమాయక పిల్లాడిలా అర్జున్ పోస్టర్లో కనిపిస్తాడు .. అర్జున్ కపూర్ భూమి పట్నికర్ , రకుల్ ప్రీత్ సింగ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు .. ఈ సినిమా ఈనెల 21న ప్రేక్షకులు ముందుకు రానుంది . మరి ఈ సినిమాతో అయినా అర్జున్ కపూర్ ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: