అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణ గురించి వచ్చే పాట ఎంతో ఫేమస్ .. కేవలం ఈ పాటకు ఇప్పటికి ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు .. అయితే ఈ పాటలో కనిపించిన చిన్నారికి సైతం సపరేట్ అభిమానులు ఉన్నారు .. దేవీపుత్రుడు సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ మళ్ళీ ఏ సినిమాలో కూడా నటించలేదు. ఇక ఈ చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వేగా తమోటియా .. 1985లో జన్మించిన ఈ వయ్యారి చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది .. ఆ తర్వాత హీరోయిన్ గా కూడా మారింది .. టాలీవుడ్ లో హౌస్ ఫుల్ మూవీ ద్వారా హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది .. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవడంతో ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు .. అలాగే తెలుగుతోపాటు తమిళం , హిందీలో కూడా ఈమె పలు సినిమాల్లో నటించినప్పటికీ సరైన బ్రేక్ రాలేదు ..
టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన హ్యాపీ హ్యాపీగా సినిమాతో కూడా మరోసారి ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇది కూడా అంతేగా మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు తెలుగులో అంతగా ఆఫర్స్ రాకపోవడంతో సినిమాలకు దూరమైంది .. తర్వాత తన చదువును పూర్తి చేశాక ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పుడూ ఏదో ఒక పోస్ట్ పెడుతూ నేటిజల్లును ఆకట్టుకుంటుంది .. దేవీపుత్రుడు సినిమాలో ఎంతో బొద్దుగా క్యూట్గా కనిపించిన వేగ ఇప్పుడు ఇంత గ్లామరస్ బ్యూటీగా మారిపోయి ప్రేక్షకులకు షాక్ ఇస్తుంది.