అయినా బన్నీ రాలేదు .. ఈవెంట్ ముగిసే టైం కు వస్తారని అంతా ఎదురు చూశారు .. కానీ రాలేదు. దీనికి రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. బన్నీ నడుస్తుంటే కాలు స్లిప్పు అయ్యి మెలిక పడిందని .. అందువల్ల రాలేదన్న గుసగుసలు టాలీవుడ్ వర్గాల్లో ఇంటర్నల్ గా వినిపిస్తున్నాయి. అలాంటిది ఉంటే తండ్రి అల్లు అరవింద్ వేదిక మీద అఫీషియల్ గా చెప్పి ఉండాలి .. అలాంటిదేమీ చెప్పలేదు .. తండేల్ సినిమా బన్నీ చూసి ఉంటారని సంతృప్తి చెంది ఉండరని .. ఇప్పుడు వేదిక మీదకు వస్తే కచ్చితంగా హిట్ .. సూపర్ హిట్ లాంటి మాటలు చెప్పాల్సి వస్తుందని అందుకే రాలేదన్న గుసగుసలు కూడా మరో పక్క వినిపిస్తున్నాయి.
సినిమా అల్లు అర్జున్ కుటుంబం బ్యానర్ మీద నిర్మించారు. తండ్రి నిర్మాత .. అలాగే తన సన్నిహితుడు .. స్నేహితుడు బన్నీ వాస్ మరో నిర్మాత. అలాంటి సినిమా ఫంక్షన్కు బన్నీ కచ్చితంగా వస్తారని అధికారిక ప్రకటన వచ్చాక కూడా స్కిప్ కొట్టారంటే ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందని వినిపిస్తోంది. అది ఏమిటన్నది మెల్లమెల్లగా గాని బయటకు రాదు.