గత ఏడాది ఎక్కువగా వినిపించిన పేర్లలో హీరో రాజ్ తరుణ్, లావణ్య, హీరోయిన్ మాల్వి మలహోత్ర పేర్లు ఎక్కువగా వినిపించాయి.. ముఖ్యంగా రాజు తరుణ్ లావణ్య అనే యువతీని వివాహం చేసుకుంటారని మోసం చేశారని అలాగే తనని గర్భవతి చేసి అబార్షన్ చేయించారని ఆరోపణలను కూడా తెలియజేస్తూ ఈమె పోలీస్ కేసు కూడా పెట్టింది. ఇలా ఎంతో హడావిడి చేసిన లావణ్య ఈ విషయంలో రాజ్ తరుణ్ కోర్టులో చూసుకుంటానని చెప్పారు.


అయితే ఆమెను ప్రేమించాను కానీ ఆమె డ్రగ్స్ కి ఆడిట్ కావడం వల్ల ఆమెతో విడిపోయాయని గతంలోని తెలిపారు రాజ్ తరుణ్. అయితే ఈ విషయం పైన లావణ్య, రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి ముఖ్య కారణం మస్తాన్ సాయి అంటూ తెలియజేసింది. అయితే ఈ మస్తాన్ సాయి పైన గతంలో కూడా డ్రగ్స్ సరఫరా సంబంధించి ఆరోపణలు కూడా ఎక్కువగా వినిపించాయి. దూర ప్రాంతాల నుంచి డ్రగ్స్ తీసుకువచ్చి రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా అమ్మేవారిని వార్తలు కూడా వినిపించాయి.


దీంతో తాజాగా లావణ్య, రాజ్ తరుణ్ కేసులో మస్తాన్ సాయిని సైతం నార్సింగ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లావణ్య ఇచ్చినటువంటి ఫిర్యాదుతోనే మస్తాన్ సాయిని అరెస్టు చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే తన ప్రైవేటు వీడియోలను కూడా రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉండేవారని పోలీసులకు తెలియజేసిందట. ఇవే కాకుండా మస్తాన్ సాయి పలువురు అమ్మాయిలతో కూడా ప్రైవేట్ గా ఉన్న సమయాలలో ఇలాంటి వీడియోలను రికార్డు చేసేవారని అమ్మాయిలకు సంబంధించి కొన్ని ప్రైవేటు వీడియో లు కూడా రికార్డు చేస్తున్నారని తన హార్డు డిస్క్లో 200 కు పైగా వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారట. ఈ విషయం ఇప్పుడు ఈ కేసులో చాలా సంచలనంగా మారింది. మరి మస్తాన్ సాయి వద్ద ఉన్నటువంటి ఆ ప్రైవేట్ వీడియోలు ఎవరివి అన్న సందేహం ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: