పుష్ప 2 చిత్రం దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న క్రేజ్ రేంజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు గత ఏడాది వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. సుమారుగా 1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్గా డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చింది. చాలామంది ఇలాంటి సినిమాలలో నటించడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ మాత్రం కోట్లు ఇచ్చిన కూడా ఇలాంటి చిత్రాన్ని చేయాలంటూ కరాకండిగా తెలియజేస్తున్నారు.


డైరెక్టర్ ఎవరో కాదు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్గా ఫ్యామిలీ డైరెక్టర్గా పేరుపొందిన కృష్ణవంశీ. ఈయన డైరెక్షన్లో ఎన్నో కుటుంబ కథా చిత్రాలు వచ్చి మంచి విజయాలను అందుకున్నాయి. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే కృష్ణవంశీ అప్పుడప్పుడు అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. వారు అడిగే ప్రశ్నలకు కూడా సమాధానాలను తెలియజేస్తూ ఉన్న సమయంలోనే తాజాగా ఒక అభిమాని కృష్ణవంశీని హర్రర్ సినిమా చేస్తే చూడాలని ఉంది అంటూ కామెంట్స్ చేయగా.. అందుకు కృష్ణవంశీ హర్రర్ సినిమా చేయాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా అంటూ తెలిపారు.


అంతలోనే మరొక అభిమాని కూడా ఓ రాబరీ మూవీ చేయండి సార్ అంటూ కామెంట్ చేశారు.. అయితే చెడ్డ పనిని గొప్పగా చూపించడం కరెక్ట్ కాదు అంటూ తెలిపారు.ఇలాంటివి తాను అసలు సపోర్టు చేయలేనని కూడా తెలిపారు..మనం తీసేటు వంటి సినిమా జనాలలో నుంచి ఆలోచన తీసుకువచ్చేలా చేయాలి కానీ చెడ్డ పనులను ప్రోత్సహించేలా ఉండకూడదంటూ ఇన్ డైరెక్ట్ గా పుష్ప సినిమా గురించి మాట్లాడారంటూ పలువురు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి కృష్ణవంశీ కావాలని అన్నారా లేకపోతే ఏంటా అన్న సంగతి తెలియాల్సి ఉన్నది. మొత్తానికి ఈ విషయం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: