పార్వతి నాయర్ తాజాగా తన ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులతో పంచుకుంది.. ఎంగేజ్మెంట్ ఫోటోలను షేర్ చేస్తూ "కొత్త చాప్టర్ మొదలు" అంటూ క్యాప్షన్ పెట్టింది. ఈ విషయం తెలిసిన నెటిజన్లు, అభిమానులు ఆమెకు కంగ్రాట్స్ చెబుతూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలని తెలుపుతున్నారు. పార్వతి నాయర్ వివాహం చేసుకోబోయే భర్త పేరు ఆశ్రిత్ అశోక్.ఈయన చెన్నైకి చెందిన బడా బిజినెస్ మ్యాన్ అని తెలుస్తోంది. అలా చెన్నైకి చెందిన యువ వ్యాపారవేత్తతో పార్వతి నాయర్ పెళ్లికి రెడీ అయింది.
పార్వతీ నాయర్ ప్రస్తుతం ఆలంబన అనే సినిమాలో చేస్తోంది. గతంలో కూడా పార్వతీ నాయర్ అజిత్ హీరోగా చేసిన ఎన్నై అరిందాల్ అనే మూవీలో కీ రోల్ పోషించింది. ఇలా ఎన్నో చిత్రాలలో నటించింది. పార్వతి నాయర్ తన వయసు 15 సంవత్సరాలు ఉన్నప్పుడే మోడలింగ్ వైపుగా అడుగులు వేసి కర్ణాటక మైసూర్ శాండిల్ సోప్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరించిందట. ఆ తర్వాత మిస్ కర్ణాటక అందాల పోటీలలో కూడా ఫస్ట్ బహుమతిని అందుకొని అందరిని ఆకట్టుకున్నది. మిస్ ఇండియా పోటీలలో కూడా పాల్గొని ఎంపిక అయిందట. ఆ తర్వాత తన నటన మీద దృష్టి పెట్టింది పార్వతి నాయర్.