ఎన్టీఆర్ గురించి తెలియని వారంటూ ఎవరు ఉండరు. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీకి హీరోగా పరిచయమైన ఎన్టీఆర్ ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. మొదట ఎన్టీఆర్ ని అభిమానులు పెద్దగా ఆదరించలేకపోయారు. కొన్ని సినిమాల్లో నటించిన తర్వాత ఎన్టీఆర్ కు విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. 


సినిమా తర్వాత దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. భారీగా కలెక్షన్లను రాబట్టింది. ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.... నందమూరి నరసింహం బాలకృష్ణకు తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. 50 సంవత్సరాల పాటు తెలుగు సినీ రంగానికి చేస్తున్న సేవలకు గాను బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా పేదలకు చేస్తున్న సేవను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును ప్రకటించింది.


ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులతో పాటు, నారా వారి కుటుంబ సభ్యులు, రాజకీయ ప్రముఖులు, సినీ రంగ ప్రముఖులు, వివిధ దేశాలలోని సెలబ్రిటీలు అందరూ బాలయ్య బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తన సోదరుడు బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సంతోషంలో కుటుంబ సభ్యులు, బంధువులందరికీ నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఘనంగా పార్టీని ఏర్పాటు చేసింది. ఈ పార్టీకి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరూ రావడం విశేషం.

హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో శనివారం సాయంత్రం పార్టీని నిర్వహించారు. అయితే ఈ పార్టీకి ఎన్టీఆర్ ను పిలవకపోవడం చాలా బాధాకరం. ఎన్టీఆర్ ఈ పార్టీకి రాలేదు. దానికి గల ప్రధాన కారణం చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి అని సమాచారం అందుతోంది. నారా భువనేశ్వరి.... ఎన్టీఆర్ ను పార్టీకి పిలువకూడదని చెప్పడం వల్లనే బాలయ్య బాబు అతడిని పార్టీకి పిలవలేదని రూమర్స్ తెరపైకి వస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు కానీ ఈ వార్త ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: