గత కొద్ది రోజుల నుండి మంచు వారు పంచాయితీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అటు మీడియాతో పాటు ఇటు సోషల్ మీడియాలో కూడా మంచు ఫ్యామిలీ పరువు మొత్తం పోతుంది. ఇక ఈ గొడవ అంతా ఆస్తి తగాదాలే అని చాలాసార్లు వినిపించినప్పటికీ మనోజ్ మాత్రం నాకు ఆస్తి అక్కర్లేదు..కానీ నాన్నగారు యూనివర్సిటీలో అవకతవకలు జరుగుతున్నాయి.నాన్నగారిని ముందు పెట్టి విష్ణు నడిపిస్తున్న నాటకం ఇది అంటూ మంచు విష్ణు పై ఫైర్ అయ్యారు. అలా దెబ్బలాటలు, తోపులాటలు, పరస్పరం నిందించుకోవడం ఇలా ఎన్నో జరిగాయి. అయితే తాజాగా మోహన్ బాబు తన ఇంట్లో మనోజ్ ఉండడం ఇష్టం లేక కోర్టులో కేసు వేసి జల్ పల్లిలోని తన నివాసం ఇచ్చివేయాలని కేసు వేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ కేస్ కు సంబంధించి రంగారెడ్డి జిల్లాలో మోహన్ బాబు మనోజ్ ఇద్దరు కలెక్టర్ ఎదుట హాజరవాల్సి వచ్చింది.

అలా ఇద్దరూ కలెక్టర్ దగ్గరికి వచ్చిన సమయంలో మనోజ్ తన తండ్రి కాళ్లు మొక్కెందుకు ప్రయత్నించగా.. మోహన్ బాబు మాత్రం చాలా కోపంగా నన్ను తాకే అర్హత నీకు లేదు.. డోంట్ టచ్ అంటూ మండిపడినట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయంలో మనోజ్ చాలా బాధపడి పోయారట. అలాగే వీరిద్దరూ జల్ పల్లిలోని నివాసం గురించి వాద ప్రతి వాదనలు చేసుకున్న తర్వాత మంచు మనోజ్ చాలా సీరియస్ గా బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మీడియా వాళ్లకి సమాధానం చెప్పాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో అధికారులు మంచు మనోజ్ ని వెనుక గేట్ నుండి పంపించారని సమాచారం. ఏది ఏమైనప్పటికీ మంచు ఫ్యామిలీలో కోపాలు ఇంకా చల్లారడం లేదు. 

ఇక మనోజ్ వైఖరి ఇలా ఉంటే మోహన్ బాబు వైఖరి మరోలా ఉంది.విష్ణు తండ్రిని అడ్డుపెట్టుకొని నాటకాలు ఆడుతున్నాడని మనోజ్ ఫైర్ అవుతున్నారు. ఈ విషయంలో మోహన్ బాబు రెండో భార్య మనోజ్ తల్లి నిర్మలాదేవి చాలా వేదనకు గురవుతుంది.. అలా ఇంట్లో నాలుగు గోడల మధ్య చర్చించుకోవాల్సిన విషయం కాస్త రోడ్డుకి ఎక్కడంతో మంచు ఫ్యామిలీ పరువు మొత్తం గంగలో కలిసిపోయింది.మోహన్ బాబు సినిమాల్లో నటించి  ఇన్ని రోజులు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అన్నీ ఒక్క గొడవతో పోయాయి అంటున్నారు ఆయన అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: