యాంకర్ అనసూయ ఎప్పుడు బోల్డ్ గా మాట్లాడుతూ.. స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఉంటూ ఎవరైతే నాకేంటి అనే విధానంలో ఉంటుంది. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లోకి వచ్చిన అనసూయ స్టార్ యాంకర్ గా కూడా పేరు తెచ్చుకుంది.ప్రస్తుతం విలన్ గా చేస్తూ అలాగే పలు సినిమాలో కీ రోల్స్ పోషిస్తూ ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఇక అనసూయ అనే పేరు చెప్పగానే అందరికీ రంగమ్మత్త, ద్రాక్షాయణి వంటి పాత్రలు గుర్తిండి పోయేలా ఆ పాత్రల్లో ఒదిగిపోయి నటించింది. అయితే అలాంటి అనసూయ రీసెంట్ గా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాల్గొని ఎన్నో బోల్డ్ కామెంట్లు చేసింది.అబ్బాయి అమ్మాయి మధ్య జరిగే విషయం గురించి పచ్చిగా మాట్లాడి సంచలనం సృష్టించింది. అయితే అదే ఇంటర్వ్యూలో అనసూయ తనకు ఇండస్ట్రీలో ఎదురైనా కొన్ని చేదు అనుభవాలను కూడా పంచుకుంది.

 ఇండస్ట్రీకి వచ్చి కొద్ది రోజులు అయ్యాక అనసూయని ఓ స్టార్ హీరో వేధించారట. నువ్వు నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి నా కోరిక తీరిస్తే నీకు ఇంకా పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తాను అని పక్కలోకి రమ్మని చెప్పాడట.కానీ అనసూయ మాత్రం నువ్వు ఇవ్వకపోయినా నాకు అవకాశాలు వస్తాయి.నీ సహాయం నాకు ఏమీ అవసరం లేదు నా నటన మీద నాకు నమ్మకం ఉంది అని ఆ హీరోకి మొహం మీద చెప్పి వచ్చేసానని, కానీ ఇది జరిగిన తర్వాత నాకు సినిమాల్లో పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. ఇక హీరో మాత్రమే కాదు ఓ నిర్మాత కూడా నన్ను అలాగే కమిట్మెంట్ అడిగి కోరిక తీర్చుకోవాలి అనుకున్నాడని కానీ ఈ విషయం తెలిసి నేను లెఫ్ట్ అండ్ రైట్ ఇవ్వడంతో ఆయన సైలెంట్ అయ్యారు అంటూ అనసూయ చెప్పుకొచ్చింది.

అయితే హీరో నిర్మాతలు తనని కమిట్మెంట్ అడిగారని చెప్పింది కానీ వాళ్ల పేర్లు ఏంటో బయట పెట్టలేదు. అలా అనసూయ చాలా ధైర్యంగా తనకు ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇక ధైర్యంగా మాట్లాడడమే కాదు పొట్టి పొట్టి బట్టలు వేసుకోవడంలోనూ అనసూయ ముందుంటుంది.అంతేకాదు నా శరీరం నా ఇష్టం.. నా బట్టలు నా ఇష్టం..నేను పొట్టి బట్టలు వేసుకుంటాను.. బికినీ వేసుకొని తిరుగుతాను.. మీకేంటి కష్టం అన్నట్లుగా కూడా ఆ ఇంటర్వ్యూలో మాట్లాడింది

మరింత సమాచారం తెలుసుకోండి: