2023లో ఆరాధ్య బచ్చన్ ఆరోగ్యం పైన చాలా వదంతులు వచ్చాయని కొన్ని వెబ్సైట్లో సోషల్ మీడియాలో కూడా యూట్యూబ్ ఛానల్ లో కూడా ఆమె మరణించిందనే విధంగా ప్రచారం చేశారట. అప్పట్లో దీనిపైన ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును సైతం ఆశ్రయించినట్లు తెలుస్తోంది. తనపైన ఇలాంటి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారందరి పైన వార్నింగ్ ఇస్తూ అలాంటివన్నీ తీసేయాలని చెప్పిందట. అయితే కొంతమంది ఇంకా వాటిని పట్టించుకోకుండా అలాగే స్ప్రెడ్ చేస్తూ ఉండడంతో మరొకసారి ఆరాధ్య బచ్చన్ కోర్టులో పిటిషన్ వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.
కోర్టు చెప్పిన కూడా ఇంకా అలాంటి వార్తలను తీసివేయకుండా ప్రచారం చేస్తూ ఉండడంతో కఠిన చర్యలు తీసుకోవాలంటూ తన పిటీషన్ లో వెల్లడించిందట ఆరాధ్య.. దీంతో హైకోర్టు సైతం నిన్నటి రోజున గూగుల్ కి నోటీసులు కూడా జారీ చేసిందట. దీనిపైన మార్చి 17వ తారీఖున తదుపరి విచారణ జరగబోతుందని కోర్టు తెలియజేయడం జరిగింది. ఈలోపు ఆరాధ్య పైన వస్తున్న వార్తలను తీసివేస్తారో లేదో చూడాలి మరి. మొత్తానికి తన పైన వినిపిస్తున్న వదంతులకు గట్టిగానే రియాక్ట్ అవుతున్నది ఐశ్వర్యరాయ్ కూతురు ఆరాధ్య బచ్చన్. అభిషేక్ బచ్చన్ కూడా ఇటీవలే ఎన్నో ఇంటర్వ్యూలలో తన కుటుంబం గురించి చాలా బాగా వివరిస్తూ ఉన్నారు.