అక్కినేని నాగచైతన్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు. కానీ అందులో మోస్ట్ ఆఫ్ ది సినిమాలు ఫ్లాప్ అనే చెప్పుకోవచ్చు. ఆయన నటించిన ఏ సినిమా కూడా ఆశించినంత ఫలితాన్ని అయితే ఇవ్వలేదు. ఇక కొన్ని సినిమాలు హిట్ అయినప్పటికీ అవి డైరెక్టర్, హీరోయిన్ ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. ఇక స్వయంగా ఆయన హిట్టు కొట్టి పేరు తెచ్చుకోవాలంటే అది తండేల్ తోనే సాధ్యం అంటున్నారు అక్కినేని అభిమానులు.అయితే ఇప్పటివరకు నాగచైతన్య ఖాతాలో కొన్ని హిట్ సినిమాలు ఉన్నాయి.కానీ అవి బ్లాక్ బస్టర్ అనేంతలా లేవు. కానీ తండేల్ సినిమాతో నాగచైతన్య తండేల్ రాజు అవుతాడని కొంతమంది అంటుంటే..ఈ సినిమా హిట్ అయినా మళ్లీ అది సాయి పల్లవి ఖాతాలోకే వెళుతుంది అని మరి కొంతమంది అంటున్నారు.ఇక ఈ విషయం పక్కన పెడితే.. కొంతమంది హీరోలు డైరెక్టర్లపై ఎక్కువ నమ్మకం పెట్టుకొని మునిగిపోయిన వాళ్ళు ఉన్నారు.

అలాంటి వారిలో నాగచైతన్య కూడా ఒకరు. ఎందుకంటే ఈయన తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు ని నమ్మి కస్టడీ సినిమా చేసి కష్టాల్లో మునిగిపోయారు.. వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చిన కస్టడి మూవీ థియేటర్లోకి అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.నాగచైతన్య కృతి శెట్టి కాంబోలో 2023 మే 12న కస్టడీ విడుదలైంది. అయితే నాగచైతన్య తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభుతో చేయడంతో ఈ సినిమాపై అభిమానుల్లో కాస్త అంచనాలు ఉండేవి. కానీ ఈ సినిమా నాగచైతన్య ఖాతాలో భారీ ఫ్లాఫ్ ని వేసింది. అలా కస్టడీ మూవీలో ప్రియమణి,అరవింద స్వామి, శరత్ కుమార్లు కూడా కీ రోల్స్ పోషించారు. అలాగే ఈ సినిమాకి ఇళయరాజా,యువన్ శంకర్ రాజాలు సంగీతం అందించారు.అలా ఎంతో భారీ తారాగణం,మంచి మంచి టెక్నీషియన్లతో తెరకెక్కిన కస్టడీ మూవీ అతిపెద్ద ప్లాప్ అయింది.

అయితే ఈ సినిమా ప్లాఫ్ పై విజయ్ నటించిన ది  గోట్ ప్రమోషన్స్ లో పాల్గొన్న వెంకట్ ప్రభు మాట్లాడుతూ..నాగచైతన్యతో చేసిన కస్టడీ సినిమాకు ముందు అనుకున్న కథ అది కాదు. నేను అనుకున్న కథని నన్ను పూర్తి చేయనివ్వలేదు.అందులో నిర్మాతలు, హీరో వేలు పెట్టడం వల్ల తప్పు జరిగింది.అలాగే నేను అనుకున్న సినిమాని వేరే విధంగా తీయాలని, కొన్ని మార్పులు చేయాలి అని నిర్మాతలు చెప్పడం వల్లే నేను అలా తెరకెక్కించాను. అందుకే ఆ సినిమా భారీ ఫ్లాఫ్ అయింది. నా సొంతంగా చేసిన సినిమాలు ఇప్పటివరకు ప్లాఫ్ కాలేదు.కానీ వేరే వాళ్ళు నా సినిమా కథలో వేలు పెడితే మాత్రం ఆ సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంటూ కస్టడీ మూవీ పై సంచలన కామెంట్లు చేశారు డైరెక్టర్.అలా ఏది ఏమైనప్పటికీ తమిళ డైరెక్టర్ ని నమ్మి నిండా మునిగిపోయారు నాగచైతన్య.

మరింత సమాచారం తెలుసుకోండి: