ఇప్పటివరకు చాలా సినిమాలు తెలుగులో హిట్ అయినవి ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం అలాగే ఇతర భాషల్లో హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయడం అనేది చాలాకాలం నుండి ఇండస్ట్రీలో జరుగుతున్న తంతే..అలా ఇప్పటికే ఎంతోమంది తెలుగు హీరోలు ఇతర సినిమాలను రీమేక్ చేశారు.అలాగే ఇతర హీరోలు మన తెలుగు సినిమాలను కూడా రీమేక్ చేశారు. అయితే అలా రీమేక్ చేసిన సినిమాల్లో వేరే భాషల్లో హిట్ అయిన సినిమాలు తెలుగులో ఫ్లాప్ అయినవి ఉన్నాయి. అలాగే తెలుగులో బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు వేరే భాషల్లో ప్లాఫ్ అయినవి ఉన్నాయి  అలాంటి వాటిలో ఒకటే జాను మూవీ.. కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి,త్రిష కాంబినేషన్లో వచ్చిన 96 అనే మూవీని తమిళంలో సి.ప్రేమ్ కుమార్ డైరెక్షన్ చేశారు. ఇక తమిళంలో ఈ సినిమా 2018 అక్టోబర్ 4 విడుదలై  అతిపెద్ద సెన్సేషన్ సృష్టించింది.అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయిన 96 అనే మూవీకి సీక్వెల్ కూడా తీయాలి అని గత కొద్ది రోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. 

అయితే తమిళంలో భారీ హిట్ అయిన 96 మూవీని తెలుగులో కూడా రీమేక్ చేయాలి అనుకున్నారు మేకర్స్. అలా ప్రేమ్ కుమార్ డైరెక్షన్లోనే తెలుగులో జాను పేరుతో ఈ సినిమా రిమేక్ అయింది. ఇక ఈ జాను మూవీ లో సమంత,శర్వానంద్ హీరో హీరోయిన్లుగా చేశారు. అయితే తమిళంలో హిట్ అయిన 96 మూవీ తెలుగులో జాను పేరుతో విడుదలై భారీ ఫ్లాఫ్ అయింది. 2020 ఫిబ్రవరి 7న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదలైన జాను మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది..దాంతో ఈ సినిమా రిజల్ట్ పై చాలామంది అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ సినిమా లో సమంత శర్వానంద్ నటన బాగున్నప్పటికీ ప్రేక్షకులు మాత్రం సినిమాని ఆదరించలేకపోయారు. అలా తమిళంలో హిట్ అయిన ఈ సినిమా తెలుగులో మాత్రం భారీ ఫ్లాఫ్ అయింది.ఇక ఇదే సినిమాని కన్నడలో 99 గా రిమేక్ చేశారు. అక్కడ కూడా ఓకే టాక్ తెచ్చుకుంది.

కానీ తెలుగులో మాత్రమే దెబ్బకొట్టింది. అలా ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై నిర్మించిన దిల్ రాజు సైతం నష్టాల పాలయ్యారు. ఇక సమంత క్రేజ్ తో ఈ సినిమా హిట్ అవుతుందని చాలామంది అనుకున్నారు.కానీ సమంత క్రేజ్ కూడా ఈ సినిమాకి ఏమాత్రం పనికి రాలేదని చెప్పుకోవచ్చు.ముఖ్యంగా ప్రేమ్ కుమార్ డైరెక్షన్ ని తమిళ ప్రేక్షకులు ఆదరించినంతగా తెలుగు ప్రేక్షకులు ఆదరించలేకపోయారని విమర్శలు వచ్చాయి. అలా 96 పేరుతో తమిళంలో విడుదలైన మూవీ భారీ హిట్ అయితే తెలుగులో రీమేక్ అయిన జాను మూవీ మాత్రం భారీ ఫ్లాఫ్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: