విక్టరీ వెంకటేష్ గతంలో నటించిన “చంటి” సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.. రావి రాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు దర్శకుడు పి. వాసు స్టోరీ అందించారు..వెంకటేష్ కెరీర్ లో చంటి సినిమా మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.. ఆ సినిమాతో వెంకీ మామకు ఫ్యామిలీ హీరోగా మంచి గుర్తింపు లభించింది.. అయితే వెంకటేష్ సినీ ఇండస్ట్రీకి వచ్చి 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో తన తరువాత సినిమాను పి. వాసు డైరెక్షన్ లో చేసాడు.. ఆ సినిమానే “నాగవల్లి”.. 

సినిమా కన్నడ చిత్రం"ఆప్తరక్షక"అనే సినిమాకు రీమేక్ గా వచ్చింది.. గతంలో వచ్చిన చంద్రముఖి సినిమాకు రీమేక్ గా “ఆప్త రక్షక “సినిమా తెరకెక్కింది... దానిని తెలుగులో విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు పి. వాసు “నాగవల్లి “ పేరుతో రీమేక్ చేసాడు..కానీ గతంలో రజనీ కాంత్ ని ఇలాంటి పాత్రలో చూసిన ప్రేక్షకులు ఈ సినిమాలో వెంకటేష్ పాత్రని అతనితో పోల్చి చూసారు.అందుకు తగ్గట్టే వెంకటేష్ కూడా తన ప్రయత్నలోపం ఏమి లేకుండా,తన శక్తిమేరకు ఈ పాత్రలో అద్భుతంగా నటించాడు...ఈ సినిమాలో డాక్టర్ విజయ్ గా వెంకటేష్ తన సహజసిద్ధమైన నటనతో అలరించగా,నాగభైరవ రాజశేఖరుడిగా కాస్త నెగెటీవ్ టచ్ ఉన్న పాత్రలో కూడా ఎంతో అద్భుతంగా నటించాడు.ఇక నాగభైరవ రాజశేఖరుడు అఘోరాగా మారాక,ఆ పాత్ర నిడివి కాస్త తగ్గినా ఆ గెటప్ లో వెంకటేష్ కొత్తగా కనిపించటమే కాక నటన కూడా మాస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.


ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ అనుష్క నాగవల్లిగా నటించింది..నటన పరంగా బాగా నటించినప్పటికీ,నాగవల్లిగా ఆమె చేసిన నాట్యంలో గ్రేస్ లేకపోవటంతో ప్రేక్షకులకి అంతగా ఎక్కలేదు....ఇక పిచ్చిపట్టిన అమ్మాయిలా కమలినీ ముఖర్జీ అద్భుతంగా నటించింది.. చంద్రముఖిలో సిద్ధాంతిగా మెప్పించిన అవినాష్ ఈ సినిమాలో కూడా అద్భుతంగా నటించాడు.చంద్రముఖి ఆవహించిన అమ్మాయిలా రీచా గంగోపాథ్యాయ నటన సైతం ప్రేక్షకులని అబ్బురపరుస్తుంది..అలాగే ఈ సినిమాలో శ్రద్ధా దాస్,పూనమ్ కౌర్ కూడా నటించిన వారి పాత్రలకు పెద్ద స్కోప్ లేదు..చంద్రముఖితో సక్సెస్ అయిన పి. వాసు స్ట్రాటెజీ నాగవల్లితో బెడిసి కొట్టింది..ప్రేక్షకులు ఈ సినిమాను చంద్రముఖితో పోల్చి చూడటంతో అంత గొప్పగా ఏమి అనిపించలేదు.. దీనితో ఈ సినిమా వెంకటేష్ కెరీర్ లో యావరేజ్ చిత్రంగా నిలిచింది..

మరింత సమాచారం తెలుసుకోండి: