ఇటీవలే మళ్లీ తరచూ వార్తలలో నిలుస్తూ ఉన్న అమ్మాయి లావణ్య, రాజ్ తరుణ్ భార్యగా చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నది.. అయితే ఈమె కేసులో చాలా కీలకమైన వ్యక్తి మస్తాన్ సాయి అని ఎన్నోసార్లు తెలియజేసింది. ఈ విషయం పైన నార్సింగ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడంతో మస్తాన్ సాయిని అరెస్టు చేశారు పోలీసులు. అయితే రాజ్ తరుణ్ తనతో విడిపోవడానికి కారణం ఈ మస్తాన్ సాయి అన్నట్లుగా తెలియజేసిందట. అంతేకాకుండా పలువురు అమ్మాయిలతో ప్రైవేట్ గా ఉన్న వీడియోలను ఫోటోలను సైతం తీస్తూ ఉంటారని వీటివల్ల మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటాడని నిన్నటి రోజు నుంచి ఈ విషయం ఫిర్యాదులో తెలియజేసినట్లుగా వైరల్ గా మారింది.


అయితే ఇక అతన్ని అరెస్టు చేసిన పోలీసులు సైతం మళ్లీ విడిచిపెట్టినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే మస్తాన్ సాయి స్పందిస్తూ లావణ్య చెబుతున్నట్టుగా ఆ వీడియోలో ఉన్నది ఎవరో కాదు అని తన భార్య తన గర్ల్ ఫ్రెండ్ తో తీసుకున్న వీడియోలు అంటూ వెల్లడించారట.. అయితే తన పైన కావాలని ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారని 2017లో హనీమూన్ కి వెళ్ళినప్పుడు తీసుకున్నటువంటి వీడియోలు అన్నట్లుగా తెలియజేశారట మస్తాన్ సాయి.



అయితే ఇప్పుడు ఉన్న హార్డ్ డిస్క్ లో లావణ్య కు సంబంధించి యాంటీ ఎవిడెన్స్ ఉంటున్నాయని వాటిని మాయం చేసేందుకే లావణ్య హార్డు డిస్క్ ను దొంగతనం చేసింది అంటూ మస్తాన్ సాయి తెలియజేశారు. లావణ్య, రాజు తరుణ్ కేసులో రోజుకొక ట్విస్ట్ వినిపిస్తూనే ఉన్నది. అయితే వీరు చెప్పే మాటలకు అటు పోలీసులకు కూడా కన్ఫ్యూజన్లో పడేవేసేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు రాజ్ తరుణ్ మాత్రం ఈ విషయం పైన మళ్ళీ స్పందించలేదు. మరి రాబోయే రోజుల్లో లావణ్య, మస్తాన్ సాయి, రాజ్ తరుణ్ వ్యవహారం ఎప్పటి వరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: