టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో నాగ చైతన్య ఒకరు. ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో చాలా సినిమాలలో హీరో గా నటించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలను సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే ఈయన కొంత కాలం క్రితం ఓ తమిళ దర్శకుడిని నమ్మి భారీ అపజయాన్ని బాక్సా ఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు.

అసలు విషయం లోకి వెళితే ... నాగ చైతన్య కొంత కాలం క్రితం తమిళ దర్శకుడు అయినటువంటి కృష్ణ మారిముతు దర్శకత్వంలో యుద్ధం శరణం అనే సినిమాలో హీరో గా నటించాడు. లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో నాగ చైతన్య కు జోడిగా నటించగా ... శ్రీకాంత్ ఈ సినిమాలో ప్రతి నాయకుడి పాత్రలో నటించాడు. ఇక శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం , ఈ మూవీ విడుదలకు ముందు ఈ సినిమా నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ ద్వారా నాగ చైతన్య కి ఒక మంచి విజయం దక్కుతుంది అని చాలా మంది భావించారు. అలా మంచి అంచనాల నడుమ ఈ సినిమా 2017 వ సంవత్సరం సెప్టెంబర్ 8 వ తేదీన విడుదల అయింది. ఇక మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి నెగటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపలేదు.

చివరగా ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయాన్ని ఎదుర్కొంది. ఇలా నాగ చైతన్య తమిళ దర్శకుడు అయినటువంటి కృష్ణ మారిముతు ను నమ్మి యుద్ధం శరణం మూవీ తో భారీ అపజయాన్ని అందుకున్నాడు. రావు రమేష్మూవీ లో ఓ ముఖ్యమైన పాత్రలో నటించగా ... వివేక్ సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. వారాహి బ్యానర్ వారు ఈ మూవీ ని నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: