కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అజిత్ కుమార్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన విజయవంతమైన సినిమాలలో హీరోగా నటించి తమిళ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో అజిత్ ఆయన నటించిన సినిమాలను దాదాపుగా తెలుగు లో విడుదల చేస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఈయన నటించిన కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను అందుకున్నాయి. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఇకపోతే అజిత్ కుమార్ తాజాగా విడ ముయార్చి అనే తమిళ సినిమాలో హీరోగా నటించాడు. త్రిష ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఇకపోతే ఈ సినిమాను ఫిబ్రవరి 6 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమాను ఫిబ్రవరి 6 వ తేదీన తమిళ్ తో పాటు తెలుగు లో కూడా విడుదల చేయనున్నారు. తెలుగులో ఈ సినిమాను పట్టుదల అనే టైటిల్ తో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఈ మూవీ పై తమిళ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా తమిళ్ వర్షన్ కి సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఈ మూవీ కి చెన్నై సిటీలో అద్భుతమైన రేంజ్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఇంపాక్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన బుకింగ్స్ చెన్నై సిటీలో నాలుగు కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటినట్లు తెలుస్తోంది. ఇలా చెన్నై సిటీలో ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే అద్భుతమైన ఇంపాక్ట్ ను చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా విడుదలకు ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. ఆ లోపు ఈ సినిమా చెన్నై సిటీలో మరిన్ని గ్రాస్ కలెక్షన్లను అడ్వాన్స్ బుకింగ్ ద్వారా అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak