కృతిశెట్టి ఇప్పుడు కోలీవుడ్లో పలు సినిమాలో నటిస్తూ బిజీ గా ఉంది. టాలీవుడ్ లో ఒక్కటంటే ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు . నిజంగా అది ఆమెకి బిగ్ రీ మార్క్ అనే చెప్పాలి . అయితే ఎవరు ఊహించని విధంగా కృతి శెట్టి బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆఫర్ అందుకోవడం సంచలనంగా మారింది. అది కూడా ఒక ఐటెం సాంగ్ లో చిందులు వేయబోతుంది అన్న వార్త ప్రచారంలోకి రావడంతో కృతిశెట్టి పేరు ఇండస్ట్రీలో హాట్ హాట్ ట్రెండ్ అవుతుంది. రీసెంట్ గానే శ్రీ లీల పుష్ప2 సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించి మెప్పించింది .
అయితే ఆమెకు ఈ సినిమాలోని పాట పెద్దగా అవకాశాలు తెచ్చిపెట్టలేకపోయింది . అయితే కృతిశెట్టి ఇలాంటి మూమెంట్లోనే ఈ నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో స్పెషల్ సాంగ్ లో చిందులు వేయబోతుంది ఈ అందాల బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి అంటూ ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. కృతిశెట్టి ఐటెం సాంగ్ లో నటిస్తే ఖచ్చితంగా ఆమె కెరీర్ ఢమాల్ అంటూ పడిపోతుంది. ఆ విషయం అందరికీ తెలుసు. మరి అన్ని తెలిసిన కృతి శెట్టీ ఎలా ఓకే చేసింది అనేది అర్థం కావడం లేదు అంటున్నారు ఫ్యాన్స్. చూద్దాం మరి ఏం జరుగుతుందో..? ఇది నిజంగా ఫ్యాన్స్ కి ఊహించని షాక్ అంటున్నారు జనాలు..!