చిన్న హీరో నుంచి మొదలు స్టార్ హీరో వరకు భారీ బడ్జెట్ తోనే సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు తెలుగు దర్శక నిర్మాతలు.. కంటెంట్ బలంగా ఉంటే చాలు ఎన్ని కోట్లయినా పెట్టడానికి సిద్ధంగానే ఉన్నారు. అయితే నిర్మాతలకు నాన్ థియేట్రికల్ రైట్స్ పెద్ద బలం అని కూడా చెప్పవచ్చు. పెట్టుబడిలో సగం వాటి నుంచి లభిస్తూ ఉంటుంది. విడుదలకు ముందే ఇలా నాన్ థియేట్రికల్ రైట్స్ బిజినెస్ వల్ల దాదాపుగా గట్టు ఎక్కుతారని చెప్పవచ్చు. తాజాగా నాగచైతన్య, సాయి పల్లవి నటించిన తండేల్ సినిమా విషయంలో కూడా విజయం సాధించిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో గీత ఆర్ట్స్ బ్యానర్ పైన 90 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఇందులో 60 కోట్ల నాన్  థియేట్రికల్ రైట్స్ రూపంలోనే రాబట్టి కలిగిందట. అలాగే ఓటిటి హక్కులను కూడా నెట్ ఫ్లిక్ రూ.35 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. సాటిలైట్ రైట్స్ రూ.10 కోట్లు ఆడియో రైట్స్ రూ .7 కోట్లు వచ్చిందని అలాగే హిందీ రైట్స్ రూ .8 కోట్ల రూపాయలు లభించాయని ఇలా మొత్తం మీద రూ .60 కోట్లు రాబట్టిందట.


మరో 30 కోట్లు రాబడితే ఈ సినిమా ఫేస్ జోన్ లో ఉంటుందని తాకు వినిపిస్తోంది. తండేల్ సినిమా 70 కోట్ల రాబడితే మంచి బజ్ ఉంటుందని చెప్పవచ్చు. మరి బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి పోటీ లేకుండా ఈ సినిమాకి హిట్ టాక్ వస్తే ఖచ్చితంగా వసూళ్లలో ప్రభంజనం సృష్టిస్తుందని అభిమానులు కూడా తెలుపుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీన ఈ సినిమా భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. అయితే ప్రీమియర్ షోలు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల లేవు కాబట్టి ఏడవ తేదీని రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: