ప్రజెంట్ తండేల్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు నాగచైతన్య . ఈ సినిమా హిట్ అవ్వడం కోసం బాగా కష్టపడుతున్నాడు నాగచైతన్య . అయితే ఇదే మూమెంట్లో పలుచోట్ల శోభిత ధూళిపాళ్లను హైలెట్ చేస్తూ మాట్లాడుతున్నారు . తన వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను బయటపెడుతున్నాడు . సరిగ్గా సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇదే విధంగా పలు ఇంటర్వ్యూలలో ఆమెను పొగిడేస్తూ ఆమెను ఓ రేంజ్ లో చెట్టెక్కించేశారు నాగచైతన్య .
పెళ్లయిన కొత్తలోనే ఆమె లేకపోతే నేనులేను అన్న రేంజ్ లో ఓ రేంజ్ లో సినిమాటిక్ డైలాగ్స్ ను వాడేసారు . సీన్ కట్ చేస్తే ఆ తర్వాత వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా మారిపోయారు . విడాకులు తీసుకొని ఒకరి ముఖం ఒకరు చూడడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . అయితే సమంత విషయంలో చేసిన తప్పే నాగచైతన్య శోభిత విషయంలో కూడా చేస్తున్నాడు అని .. తమ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టాల్సిన అవసరం లేదు అని .. సినిమా ప్రమోషన్స్ కోసం శోభిత ధూళిపాళ్లతో ఉన్న రిలేషన్షిప్ ను బయటపెట్టాల్సిన అవసరం ఏముంది ..? అంటూ ఫైర్ అవుతున్నారు జనాలు. మరొకసారి నాగచైతన్య ఇదే విధంగా చేస్తే శోభిత ధూళిపాళ్లతో కూడా విడాకులు తీసేసుకుంటాడు అని ..ఆయన తన వైవాహిక జీవితాన్ని సీక్రెట్ గా ఉంచితేనే మంచిది అంటూ సజెషన్స్ ఇస్తున్నారు జనాలు . సోషల్ మీడియాలో మరొకసారి సమంత - నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పేర్లు వైరల్ గా మారాయి..!