గేమ్ ఛేంజర్ సినిమాతో పోల్చి చూస్తే సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన సంక్రాంతి వస్తున్నాం సినిమా బెటర్ కలెక్షన్లను సాధించింది. ఈ సినిమా తాజాగా 300 కోట్ల రూపాయల కలెక్షన్ల మార్క్ ను టచ్ చేసిన సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ తో శంకర్ చరణ్ ను నిండా ముంచేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చరణ్ కెరీర్ కు గేమ్ ఛేంజర్ మాయని మచ్చ అని చెప్పవచ్చు.
గేమ్ ఛేంజర్ మూవీ డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ సొంతం కాగా థియేటర్లలో సంక్రాంతి సినిమాల హవా కొంతమేర తగ్గిందనే చెప్పాలి. మరికొన్ని రోజుల్లో తండేల్ సినిమా విడుదలవుతుండగా ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం సంక్రాంతి సినిమాల హవా పూర్తిస్థాయిలో ముగిసినట్టే అవుతుందని కామెంట్లు వ్యకమవుతున్నాయి. హీరోయిన్ కియారాకు సైతం గేమ్ ఛేంజర్ మూవీ మైనస్ అయింది.
గేమ్ ఛేంజర్ ఫుల్ రన్ లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గేమ్ ఛేంజర్ కాంబో భవిష్యత్తులో రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. డైరెక్టర్ శంకర్ చరణ్ తో మూడేళ్లు కష్టపడి రొటీన్ కమర్షియల్ మూస సినిమాను తెరకెక్కించారని సోషల్ మీడియాలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ అవుతుందని ఫ్యాన్స్ భావించగా అందుకు భిన్నంగా జరిగింది. గేమ్ ఛేంజర్ సినిమా నష్టాల నుంచి కోలుకోవడానికి దిల్ రాజుకు టైమ్ పడుతుందని చెప్పవచ్చు.