సూపర్ స్టార్ మహేష్ బాబు సినీ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్లు, హిట్లు ఉన్నాయి. కొన్ని సినిమాలు మహేష్ బాబుకు భారీ విజయాలను అందిస్తే మరికొన్ని సినిమాలు మాత్రం మహేష్ బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయి. మహేష్ కెరీర్ లోని బిగ్గెస్ట్ డిజాస్టర్లలో ఒకటిగా స్పైడర్ మూవీ నిలిచింది. ఒకింత భారీ అంచనాలతో విడుదలైన స్పైడర్ కంటెంట్ విషయంలో తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.
 
సినిమా టీజర్ ఒక విధంగా ఉండటం, సినిమా మరో విధంగా ఉండటం కూడా స్పైడర్ దారుణమైన ఫలితాన్ని అందుకోవడానికి ఒక కారణమని చెప్పవచ్చు. స్పైడర్ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించడం జరిగింది. అయితే రకుల్ కు కూడా స్పైడర్ సినిమా వల్ల తీవ్రంగా నష్టం జరిగింది. ఈ సినిమా తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ కు మూవీ ఆఫర్లు తగ్గాయని చెప్పవచ్చు.
 
రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రస్తుతం తెలుగులో ఎక్కువగా ఆఫర్లు సైతం రావడం లేదనే సంగతి తెలిసిందే. రాబోయే రోజుల్లో రకుల్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. రకుల్ సరైన ప్రాజెక్ట్స్ ను ఎంచుకుని టాలీవుడ్ లో పూర్వ వైభవాన్ని సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ రెమ్యునరేషన్ సైతం తక్కువగానే ఉంది.
 
మహేష్ బాబు మాత్రం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ బెస్ట్ ప్రాజెక్ట్ లను ఎంచుకుని సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మహేష్ బాబు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉంటూ కెరీర్ బిగ్గెస్ట్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ జక్కన్న కాంబో మూవీ అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయో చూడాల్సి ఉంది. మహేష్ బాబు కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉంటాయో చూడాలి.


 


మరింత సమాచారం తెలుసుకోండి: