ప్రభాస్ కి ఉన్న ఇమేజ్ కి టాక్ కి సంబంధం లేకుండా ఈ సినిమా ఓపెనింగ్స్ అయితే రాబట్టిందట.సుమారుగా రూ .27 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం . రెబల్ వంటి ఫ్లాప్ సినిమా నుంచి కొంతమంది స్టార్స్ సైతం తప్పించుకున్నట్లు వార్త వినిపిస్తున్నాయి. ముందుగా ఈ సినిమాలో తమన్నా ప్లేస్ లో హీరోయిన్ అనుష్క శెట్టి నీ తీసుకోవలసి ఉండగా. కానీ లారెన్స్ కి అనుష్కకి మధ్య కొన్ని మనస్పర్ధలు రావడంతో ఆమె ఈ సినిమా నుంచి తప్పుకున్నదట.
అలాగే ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించేందుకు ముందు బండ్ల గణేష్ కి అవకాశం వచ్చిందని.. కానీ ఎందుకో అతను కూడా తెలివిగా ఈ సినిమా నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత సంగీత దర్శకుడు తమన్ కూడా ఈ సినిమాని చేయాల్సి ఉండగా ఎందుకో తమన్ కూడా ఈ ప్రాజెక్టు నుంచి మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారట. ఈ ముగ్గురు స్టార్స్ సైతం రెబల్ వంటి సినిమా ప్లాప్ నుంచి తెలివిగా తప్పించుకున్నారనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా ఈ సినిమా కథ లేదు అనే విధంగా అభిమానులు నిరుత్సాహాన్ని గురిచేసింది. ఆ తర్వాత మళ్లీ అలాంటి సినిమాలకు పోలేదు ప్రభాస్.