టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ తాజాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా ... ఈ సినిమాను దిల్ రాజు నిర్మించాడు. గతంలో వెంకటేష్ హీరో గా , అనిల్ రావిపూడి దర్శకత్వంలో , దిల్ రాజు నిర్మించిన ఎఫ్ 2 , ఎఫ్ 3 సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మొదటి నుండి ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బ్లాక్ బాస్టర్ టాక్ దగ్గర వచ్చింది. దానితో ఈ మూవీ ప్రస్తుతం అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తూ జెట్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసిన కలెక్షన్లకు సంబంధించిన ఓ పోస్టర్ ను అధికారికంగా విడుదల చేసింది.

పోస్టర్ ప్రకారం ఈ మూవీ ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 303 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు , ఇప్పటి వరకు రీజనల్ ఫిలిం గా విడుదల అయిన ఏ సినిమా కూడా ఈ స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేదు అని , రీజనల్ ఫిలిమ్స్ లో ఇది ఇండస్ట్రీ హిట్ గా మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ప్రస్తుతం కూడా ఈ సినిమా అద్భుతమైన హోల్డ్ ను కనబరుస్తూ సూపర్ సాలిడ్ గా దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: