ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చెంజర్ , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు , విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో అన్ని సినిమాల కంటే ముందు విడుదల అయిన గేమ్ చేంజర్ మూవీ కి నెగటివ్ తక్ రావడంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయిలో ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.

ఇక డాకు మహారాజు సినిమాకు మంచి టాక్ రావడంతో ఈ మూవీ విడుదల తర్వాత కొన్ని రోజుల పాటు మంచి కలెక్షన్లను రాబట్టింది. ఇక ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా ఆఖరుగా విడుదల అయిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు బ్లాక్ బాస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేస్తుంది. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సాలిడ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 33 కోట్ల గ్రాస్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసినట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.

ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 20 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. 20 వ రోజు ఈ సినిమా ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమా వసూలు చేయని కలెక్షన్లను వసూలు చేసి అద్భుతమైన రికార్డును సృష్టించింది. 20 వ రోజు ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 2.31 కోట్ల షేర్ కలెక్షన్లను రాబట్టింది. ఈ మూవీ తర్వాత బాహుబలి 2 మూవీ 20 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 1.56 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి రెండవ స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: