నందమూరి బాలకృష్ణ హీరోగా బాబి కొల్లి దర్శకత్వంలో తాజాగా డాకు మహారాజ్ అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నిర్మాతగా కెరియర్ను కొనసాగిస్తున్న సూర్య దేవర నాగ వంశీ నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన భారీ ఎత్తున విడుదల చేశారు. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన 22 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి ఈ 22 రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ల వివరాలను తెలుసుకుందాం.

22 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 15.29 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 12.72 కోట్లు , ఉత్తరాంధ్రలో 11.15 కోట్లు , ఈస్ట్ లో 7.21 కోట్లు , వెస్ట్ లో 5.27 కోట్లు , గుంటూరు లో 8.14 కోట్లు , కృష్ణ లో 5.48 కోట్లు , నెల్లూరు లో 3.47 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి 22 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 68.73 కోట్ల షేర్ ... 108.12 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక 22 రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 4.20 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 8.22 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇక 22 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 81.15 కోట్ల షేర్ ... 135.05 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా 82 కోట్ల టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. ఈ మూవీ మరో 82 లక్షల రేంజ్ లో షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: