సుమంత్ హీరోగా కమిలిని ముఖర్జీ హీరోయిన్గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం గోదావరి అనే క్లాస్ ఎంటర్టైనర్ మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కంటే ముందు శేఖర్ కమ్ముల దర్శకత్వం లో రూపొందిన ఆనంద్ మూవీ అద్భుతమైన విజయం సాధించి ఉండడంతో మొదటి నుండే గోదావరి మూవీ పై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు . అలా మంచి అంచనాల నడుమ 2006 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ లోని సుమంత్ , కమీలిని ముఖర్జీ నటనలకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మూవీ సుమంత్ కెరియర్ లోనే అద్భుతమైన విజయవంతమైన సినిమాలు లిస్టు లో చేరిపోయింది. ఇకపోతే 2006 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను తిరిగి మళ్ళీ థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని మార్చి 1 వ తేదీన రీ రిలీస్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు తాజాగా అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ అయిన సినిమాలు చాలా వరకు అద్భుతమైన కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టాయి. మరి 2006 వ సంవత్సరం విడుదల అయ్యి మంచి విజయం అందుకున్న గోదావరి సినిమా రీ రిలీజ్ లో భాగంగా ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో , ఏ స్థాయి కనెక్షన్ లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: