సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంత మంది మాత్రమే సూపర్ సక్సెస్ అవుతుంటారు. అలా సక్సెస్ అయిన వారు కూడా కొన్ని కారణాల వల్ల కొంత కాలం సినిమాలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితిలో కూడా కొంత మంది కి ఏర్పడుతూ ఉంటాయి. అలా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ సమయం లోనే మంచి గుర్తింపును సంపాదించుకొని అద్భుతమైన క్రేజీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకున్న కొన్ని కారణాల వల్ల కొంత కాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరం ఉండవలసి వచ్చిన బ్యూటీలలో నబా నటేష్ ఒకరు.

ఈమె నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి ఆ తర్వాత డిస్కో రాజా సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈమెకు మొదటి విజయం ఇస్మార్ట్ శంకర్ సినిమా ద్వారా వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇంకొక వరుస పెట్టి టాలీవుడ్ క్రేజీ సినిమాల్లో అవకాశాలు దక్కడం మొదలు అయింది. అలా అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాల్లో అవకాశాలు వస్తున్న సమయం లోనే ఈమెకు యాక్సిడెంట్ కావడం వల్ల కాలికి గాయం అయింది. దానితో డాక్టర్లు ఈమెకి రెస్టు తీసుకోవాలి అని సూచించడంతో అద్భుతమైన క్రేజ్ ఉన్న సమయంలో ఈమె సినిమాలకు దూరంగా ఉండవలసి వచ్చింది.

ఇక కాలి గాయం పూర్తిగా నయం కావడంతో ఈమె మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా కొంత కాలం క్రితం ప్రియదర్శి హీరో గా రూపొందిన డార్లింగ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభూ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఇలా కెరియర్ పిక్స్ లో ఉండగా యాక్సిడెంట్ కారణంగా కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటి మళ్లీ వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: