ఈ సినిమాతో ఆయన స్పెషల్ ఇమేజిని కూడా దక్కించుకున్నాడు అని చెప్పాలి . అయితే ప్రెసెంట్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 సినిమా చేస్తున్నాడు నందమూరి బాలయ్య. అయితే కెరియర్ లోనే ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో డూప్ లేకుండా నటించబోతున్నాడట బాలయ్య . నిజానికి బాలయ్య ఒక ఏజ్ వచ్చిన తర్వాత రిస్కీ షాట్స్ లో నటించాలి అన్న కొన్ని కొన్ని హార్డ్ స్టెప్స్ వేయాలి అన్న డూప్ సహాయం ఎక్కువగా తీసుకుంటూ వచ్చారట . అయితే అఖండ 2 సినిమా విషయంలో మాత్రం బోయపాటి - బాలయ్య సెన్సేషనల్ డెసిషన్ తీసుకున్నట్లు ఓ వార్త ఫిలిం సర్కిల్స్ లో ట్రెండ్ అవుతుంది.
అఖండ 2 కోసం భారీ రిస్కీ షాట్స్ ప్లాన్ చేస్తున్నాడట బోయపాటి శ్రీను. అయితే బాలయ్య ఎటువంటి డుప్ లేకుండానే ఈ రిస్కీ షాట్స్ లో నటించడానికి ఓకే చెప్పారట . బాలయ్య నిజంగానే సాహసం చేస్తున్నాడు . ఈ ఏజ్ లో రిస్కీ షాట్స్ చేయడమే పెద్ద సాహసం . అలాంటిది డూప్ లేకుండా చేయడం అంటే నిజంగా బిగ్ రిస్క్ అనే చెప్పాలి. మరి బాలయ్య ఈ రిస్క్ ని ఎంతవరకు సక్సెస్ఫుల్గా ఎదుర్కొంటారు అనేది సినిమా షూట్ మొత్తం కంప్లీట్ అయ్యాకే తెలుస్తుంది అంటున్నారు సినీ విశ్లేషకులు. మొత్తానికి అఖండ 2 తో మరో బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకునేలానే ఉన్నాడు బాలయ్య..!