ప్రభాస్ గురించి ఈ మాట చెప్పి మిమ్మల్ని నిరాశ పరిచినందుకు క్షమించాలని ఆయన వెల్లడించారు. ప్రభాస్ కు చిన్నచిన్న ఆనందాలు అంటే ఇష్టమని ఆయన తెలిపారు. ప్రభాస్ ఫామ్ హౌస్ లో సంతోషంగా ఉంటాడని ఎక్కడైనా మొబైల్ పని చేయని ప్రాంతానికి వెళ్దాం అని ఎప్పుడూ అడుగుతుంటాడని వెల్లడించారు. ప్రభాస్ ఎంతో పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ చిన్నచిన్న ఆనందాలను కోరుకోవడం చూసి నేను ఒక్కోసారి ఆశ్చర్యపోతానని పేర్కొన్నారు.
బాహుబలి తర్వాతే హిట్ సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కించడం మొదలైందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. బాహుబలి సినిమాకు ముందు సీక్వెల్స్ తెరకెక్కినా బాహుబలి2 ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో సీక్వెల్స్ పై ఆసక్తి పెరిగిందని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో రిలీజైన పుష్ప2 కూడా సూపర్ సక్సెస్ అయిందని పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. అతి త్వరలోనే సలార్2 కూడా రానుందని ఆయన వెల్లడించారు.
సలార్2 సినిమాకు సంబంధించిన అప్ డేట్స్ కోసం సినీ అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సలార్ సీక్వెల్ లో ట్విస్టులు ఆసక్తికరంగా ఉండనున్నాయని సమాచారం అందుతోంది. సలార్2 ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ రెమ్యునరేషన్ ఒకింత భారీ స్థాయిలో ఉంది. ప్రభాస్ క్రేజ్ మాత్రం ప్రస్తుతం నెక్స్ట్ లెవెల్ లో ఉంది.