ఈ వెబ్ సిరీస్ అసలు స్టోరీ ఏంటంటే .. అమెరికా వెళ్లి పెద్ద పెద్ద చదువులు చదవాలనుకునే ఒక ఇంజనీర్ అనుకోకుండా పంచాయతీ సెక్రటరీగా మారి ఓ పల్లెటూరికి వెళ్లి ఎన్ని తిప్పలపడ్డాడు ? ఇష్టంలేని ఉద్యోగం ఎలా చేశాడు ? లాంటి విషయాలను ప్రేక్షకులకు ఆకట్టుకునేలా తనదైన శైలిలో నటించడమే కాదు అందులో జీవించేసాడు రాగ్ మయూర్.. అయితే ఇదే వెబ్ సిరీస్ వచ్చిన రోజు గాంధీతాత చెట్టు అనే సినిమా రిలీజ్ అయింది .. పాన్ ఇండియా దర్శకుడు సుకుమార్ కూతురు సుకృతి ముఖ్యపాత్రలో నటించిన గాంధీతాత చెట్టు సినిమాలో .. ఒక పెద్ద బడ పారిశ్రామికవేత్తగా సతీష్ అనే పాత్రలో రాగ్ మయూర్ మరోసారి ప్రేక్షకులను పలకరించాడు .. చాలా ఏజ్ తో ఎక్కడ నడుస్తున్నాడని ఆలోచన ఎక్కడా రాకుండా సతీష్ అన్న పాత్రలో ఓదిగిపోయి నటించాడు.
అయితే నిజానికి ఇతనికి ఈ సినిమాల్లో ఉన్న స్ట్రీమ్ టైం చాలా తక్కువ అయిన తనదైన నటనతో ఉన్న కొంతసేపైనా ప్రేక్షకులను మెప్పించాడు .. ముఖ్యంగా క్లైమాక్స్ లో రాగ్ మయూర్ పాత్ర ఉండటంతో సినిమాకు మరింత ప్లస్ అయింది. ఇలా ఒకేరోజు రెండు విభిన్నమైన సినిమాలు గాంధీతాత చెట్టు , సరిపల్లి వెబ్ సిరీస్ .. రెండిటికీ ప్రేక్షకుల నుంచి మంచి పాజిటివ్ టాక్ వచ్చాయి ... అలాగే సినీ విశ్లేషకులు నుంచి మంచి రివ్యూలు కూడా వచ్చాయి ..ముఖ్యంగా సిని క్రిటిక్స్ తమ రివ్యూలలో అందరూ ఎంతో ప్రత్యేకంగా రాగ్ మయర్ నటన గురించి చెప్పుకొచ్చారు .. వైవిధ్యమైన సినిమాలు పాత్రలు చేస్తూ టాలీవుడ్ లో ఒక మంచి నటుడుగా గొప్ప క్రెజ్ తెచ్చుకోవాలని ఆశ పడుతున్న రాగ్ మయూర్ ఇప్పటికే గీత ఆర్ట్స్ 2 లో ఓ భారీ సినిమాతో పాటు పరదా , అలాగే గరివిడి లక్ష్మి సినిమాలో కూడా నటిస్తున్నాడు .. ఈ సినిమాలతో కూడా యువ నటుడు రాబోయే రోజుల్లో మరింత క్రేజ్ తెచ్చుకోవాలని ఆశిద్దాం.