రాజమౌళి ..ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా అది తక్కువగానే ఉంటుంది . మరీ ముఖ్యంగా ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో రాజమౌళి పేరు ఎలా మారుమ్రోగిపోతుందో అన్న విషయం అందరికీ తెలిసిందే . ప్రజెంట్ రాజమౌళి మహేష్ బాబు తో ఒక సినిమాని తెరకెక్కిస్తున్నాడు.  ఈ సినిమా కోసం రకరకాల టెక్నాలజీని కూడా ఉపయోగించబోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది . అంతేకాదు రీసెంట్గా మహేష్ బాబు పాస్ పోర్ట్ ని సైతం లాగేసుకున్న ఫన్నీ వీడియోస్ సోషల్ మీడియాలో యమ రేంజ్ లో వైరల్ గా మారాయి.


కాగా మహేష్ బాబుతో సినిమా అంటే ఓ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . మరి ముఖ్యంగా ఈ సినిమాలో ప్రియాంక చోప్రాని యాడ్ చేయడం.. అదేవిధంగా హాలీవుడ్ బ్యూటీ ని కూడా రంగంలోకి దించుతూ ఉండడంతో సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు జనాలు. నిజానికి రాజమౌళి ఈ సినిమాను స్టార్ హీరో అల్లు అర్జున్ తో తెరకెక్కించాలనుకున్నారట . ఆయన బాడీ ఫిజిక్ కి ఇప్పుడు రాజమౌళి అనుకున్న స్టోరీకి పర్ఫెక్ట్ గా ఉంటుంది అంటూ ఆశపడ్డారట .



కానీ చాలా ఏళ్లు కాల్ షీట్స్  ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది అని తెలియడంతో అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్సినిమా ని రిజెక్ట్ చేసిపడేశారట. పుష్ప సినిమా కోసం దాదాపు మూడున్నర ఏళ్ళు టైం మొత్తం కేటాయించేసాడు అల్లు అర్జున్ . ఇక మరొక సినిమా కోసం మరొక మూడేళ్లు కేటాయిస్తే కచ్చితంగా ఆయన కెరీర్ కు బిగ్ రిమార్క్ అవుతుంది అన్న భయంతో ఈ సినిమాని రిజెక్ట్ చేశాడట అల్లు అరవింద్ . స్టోరీ అల్లు అర్జున్ వద్దకు వెళ్లకుండానే అల్లు అరవింద్ ఈ సినిమాను రిజెక్ట్ చేసేసారట . ఆ తర్వాత మహేష్ బాబుతో ఈ సినిమా చేయాలి అంటూ ఫిక్స్ అయ్యాడట రాజమౌళి . మొత్తానికి రాజమౌళి - మహేష్ కాంబోలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అంటూ ఆశపడిన అభిమానులకి మంచి గుడ్ న్యూస్ వినిపించారు . ఈ సినిమాతో మరో ఆస్కార్ పక్క అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: