తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అలాంటి క్రేజీ హీరో, దర్శకుడు కాంబోలో అల్లు అర్జున్, త్రివిక్రమ్ ఒకరు. తాజాగా వీళ్లిద్దరు నాల్గోసారి పనిచేయడానికి రెడీ అవుతున్నారు. ఇక వీళ్ల కాంబోలో వస్తోన్న సినిమా పై ఓ వార్త హల్‌చల్ చేస్తోంది.అదేమిటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా పుష్ప-2తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు ఈయన డైరెక్టర్ త్రివిక్రమ్‌ తో జతకట్టడానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇప్పటికే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో’ సినిమాలు రాగా,ఈ మూడు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఈ క్రేజీ కాంబోలో నాల్గొవ మూవీ తెరకెక్కుతోంది. ఈ కాంబోపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్  రాగా, గీతా ఆర్ట్స్ , హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ఇదిలా ఉంటే అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న AA22 కి సంబంధించిన స్క్రిప్ట్ ఖరారు అయిందని తెలుస్తోంది. ఇది మహా భారతం నేపథ్యంలో సోసియో ఫాంటసీ చిత్రంగా తెలుస్తోంది. 

యుద్ధ దేవుడైన కార్తికేయ భగవానుడు తన తండ్రి, శక్తిమంతుడైన శివునితో తిరిగి కలవడానికి బయలుదేరిన పురాణ ప్రయాణంగా రూపొందుతున్న దీనిపై త్వరలో అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం. ప్రజెంట్ ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారడంతో అల్లు అర్జున్ కూడా ఈసారి రూట్ మార్చాడా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.ఇదిలా ఉంటే AA22 తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ బజ్  నెట్టింట వైరల్ అవుతోంది. అదేమిటంటే ముందు ఈ సినిమాను ఏప్రిల్‌లో మొదలుపెట్టాలని మేకర్స్‌ భావించినా తాజా సమాచారం ప్రకారం ఈ నెలాఖరునే షూటింగ్‌ మొదలు కానున్నట్టు తెలుస్తున్నది. ఇది బన్నీ అభిమానులకు నిజంగా శుభవార్తే. తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తారట. ఇదిలావుండగా అల్లు అర్జున్ పుష్ప2తో పానిండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నే AA22 పుష్ప తర్వాత రానున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల దృష్టి ఈ సినిమాపై పడటం సహజం. దానికి తగ్గట్టే ఊహలకు అతీతమైన గెటప్‌ను, సెటప్‌ను సిద్ధం చేసేశారట త్రివిక్రమ్‌.చూడాలి మరి ఇది ఎలాంటి హైప్ ని క్రియేట్ చేస్తుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: