పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రారంభించిన అతి తక్కువ సమయంలోనే ఖుషి సినిమాతో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన ఘనత సూర్యకు దక్కింది. పేరుకు రీమేక్ సినిమా అయినప్పటికీ.... ఒరిజినల్ సినిమాతో పాటుగా ఖుషి సినిమా వచ్చింది. కొమరం పులి సినిమా దాదాపు 1000 కి పైగా థియేటర్లలో విడుదల కావడం విశేషం. ఇక అప్పట్లో కొమరం పులి సినిమా తీస్తున్న సమయంలో మెగా హీరో పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఎస్ జె సూర్యపై చేయి చేసుకున్నాడని జోరుగా ప్రచారాలు వచ్చాయి.
పవన్ కళ్యాణ్ డైరెక్టర్ ఎస్ జె సూర్య ని కొట్టారంటూ ఎన్నో రకాల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ఎందుకు కొట్టాడు, ఏంటి అనే విషయాలు బయటకు రానప్పటికీ ఈ వార్త మాత్రం ఫిలిం సర్కిల్స్ లో విపరీతంగా వైరల్ అయింది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజముందో ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. కాగా, కొమరం పులి సినిమాను 40 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారు.
ఈ సినిమాకు సింగనమల రమేష్ బాబు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ కూడా అంత కూడా కలెక్షన్లు రాకపోవడం నిజంగా బాధాకరం. ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడానికి గల ప్రధాన కారణం తమిళ దర్శకుడు ఎస్జె సూర్య. ఇతని వల్లనే ఈ సినిమా ఫ్లాప్ అయింది అంటూ సమాచారం వచ్చింది. కాగా, ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. పాటలు మాత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.