పాన్ ఇండియ‌ స్టార్ ప్రభాస్ తన వ‌రుస‌ సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇందులో హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా కూడా ఒకటి. అయితే ప్రభాస్‌ కాలికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు ఈ షూటింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇక సమాచారం ప్రకారం.. కొంత కోలుకున్న ప్రభాస్ రీసెంట్ గా తన ‘రాజా సాబ్‌’ మూవీ పెండింగ్ షూటింగ్ ను కూడా పూర్తి చేసి, హను రాఘవపూడి ‘ఫౌజి’ షూటింగ్ ను తిరిగి ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాడట.త్వరలో కొత్త షెడ్యూల్ తమిళనాడులోని మదురై సమీపంలో మొదలు పెట్టి. అక్కడ దాదాపు 20 డేస్ పాటు దేవీపురం అగ్రహారం నేపథ్యంలో బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించిన సీన్స్‌ను షూట్ చేయబోతున్నారట. ఈ మంత్ లోనే షూటింగ్ ప్రారంభం కానుంది. ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్‌ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తుండగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇదిలావుండగా ప్రభాస్ ఇప్పటి వరకు చాలా వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ వచ్చాడు. కానీ ఆయనకు ఒక పాత్ర చేయడం అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందంట.అదే పాత్ర అంటే డాక్టర్.

అదేంటి ప్రభాస్ లాంటి స్టార్ హీరో డాక్టర్ పాత్ర పోషించాలి అంటే అంతగా నచ్చదట. ఎందుకంటే అందులో ఆయన ట్రీట్మెంట్ చేయడం సిరంజ్ పట్టుకొని ఇంజక్షన్స్ చేయడం లాంటివి అతనికి కొంతవరకు ఇబ్బందిని కలిగిస్తాయని ఇప్పటివరకు ఆయన డాక్టర్ పాత్రనైతే పోషించలేదట. మరి ఇక మీదట అలాంటి పాత్రలు వస్తే చేయడానికి తనకి అభ్యంతరం లేనప్పటికి కొంచెం భయం అయితే ఉంటుందట.మరి ఎందుకు ఆయన అంతలా భయపడుతున్నాడు అంటే ఆయనకి చిన్నప్పటి నుంచి ఇంజక్షన్స్ అంటే ఫోబియా ఉందట అందుకే ఆయన అలా ఫీల్ అవుతున్నాడు.మరి ఏది ఏమైనా కూడా ప్రభాస్ లాంటి నటుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి.ఇక ప్రస్తుతం ప్రభాస్ లాంటి స్టార్ హీరో తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాడనే చెప్పాలి. మరి ఇతను అనుకున్నట్టుగానే భారీ విజయాన్ని సాధిస్తూ ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: