ప్రస్తుతం టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ మాత్రం ఎంతో వెనకబడిందని చెప్పాలి .. ఈ కుటుంబం నుంచి ఇప్పటికే ముగ్గురు హీరోలు టాలీవుడ్ లో ఉన్న.. ఎవరు 100 కోట్లకు పైగా కలెక్షన్ రాబెట్టిన హీరోలే లేరు .. సీనియర్ హీరో నాగార్జున కూడా ప్రస్తుతం సోలో హీరోగా కన్నా సపోర్టింగ్ రోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు .. మరోపక్క మరో హీరో అఖిల్ ఏజెంట్ సినిమా దెబ్బతో రెండేళ్ల నుంచి తన నెక్స్ట్ సినిమాలపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు .. అయితే ఇప్పుడు ఈ ఇద్దరితో పోలిస్తే కాస్త నాగచైతన్య వరుస‌ సినిమాలతో దూకుడు మీద ఉన్నాడు .. అక్కినేని అభిమానులు కూడా నాగచైతన్యకి ఫుల్ సపోర్ట్ గా నిలుస్తున్నారు .. ఇప్పుడు తాజాగా త్వరలోనే ప్రేక్ష‌కుల‌ ముందుకు రాబోతున్న తండెల్‌ సినిమా విషయంలో అభిమానుల అంచనాలు ఊహించని రేంజ్ లో ఉన్నాయి.


చందు ముండేటి డైరెక్షన్లో తెరకెక్కిన తండేల్‌ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తుంది .. ఇక ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అందించిన మ్యూజిక్ సినిమాకు ఎంతో హైలెట్గా నిలిచింది .. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పాటలు కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కి కూడా సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది .. అయితే తండెల్‌ సినిమాకు వస్తున్నా క్రేజ్ చూస్తుంటే ఈసారి నాగచైతన్య గట్టిగానే ప్లాన్ చేశాడని కూడా అంటున్నారు. రీసెంట్గా తండేల్‌ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా అక్కినేని లెక్కలు మారబోతున్నాయని కూడా నాగ‌ చైతన్య ఎంతో ఖచ్చితంగా చెప్పుకొచ్చారు .. తండెల్‌ సినిమాతో అక్కినేని హీరోలు కూడా 100 కోట్ల కలెక్షన్ రాబట్టి బాక్సాఫీసును షేక్ చేయడానికి ఫిక్స్ అయ్యారు .. అదేవిధంగా తండెల్ సినిమాలకు అన్నీ కలిసి వచ్చే విధంగా కనిపిస్తున్నాయి .. ఎలాగో పోటీలో మరో సినిమా లేదు .. ఇప్పటికే ఈ సినిమా పాటలు ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసాయి.


తెలుగులో పెద్ద ఫ్యామిలీ అయినా అక్కినేని కుటుంబం నుంచి నాగార్జున స్టార్ హీరోగా ఎన్నో ప్రయోగాలు ప్రయత్నాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు .. అంతేకాకుండా ఆయన మార్క్ సినిమాలు చేస్తూ అక్కినేని అభిమానులను అలరిస్తూ వస్తున్నాడు .. అయితే ఈ రీసెంట్ టైమ్స్ లో సీనియర్ హీరోలు అంత వరస దూకుడు చూపిస్తుంటే నాగార్జున మాత్రం సరైన కథలు దొరక కాస్త సతమతమవుతున్నాడు .. నా స్వామి రంగాతో హిట్‌ కొట్టిన నాగార్జున వెంటనే మరో సినిమాను అనౌన్స్ చేయలేదు .. కూలి , కుబేర సినిమాల్లో గెస్ట్ రోల్స్ లో నటిస్తున్నాడు .. నాగార్జున తర్వాత అఖిల్ కూడా తర్వాత సినిమాపై ఇంకా ఎలాంటి ఆలోచన చేయలేకపోతున్నాడు .. ఇప్పుడు ఈ ఇద్దరినీ పక్కన పెడితే నాగ‌ చైతన్య తన సినిమాలు తో అభిమానులకి మంచి ట్రీట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు .. మరి తండెల్ సినిమాతో అక్కినేని లెక్కలు మార్చేస్తాడో లేదో అనేది మరో నాలుగు రోజుల్లో బయటకు రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: