ఈ రీసెంట్ టైమ్స్ లో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు చిన్న చిన్న గొడవలకే విడాకులు తీసుకొని విడిపోతున్నారు అనే వార్తలు ఎన్నో చూస్తున్నాం. కేవలం సినీ రంగంలో మాత్రమే కాదు .. ఇతర రంగాల్లో కూడా ఈ తరం ప్రేమికులు ఎక్కడ కలిసి ఎక్కువ కాలం జీవించలేకపోతున్నారు .. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి నడవాలి అనుకున్న వాళ్ళు ఎందుకు ఇలా మధ్యలోనే విడాకులు తీసుకుని విడిపోతున్నారు ? విడాకులు అనే అంశం కేవలం ఇద్దరి వ్యక్తులకు సంబంధించిన విషయం మాత్రమే కాదు .. ఇది రెండు కుటుంబాలకు సంబంధించిన గౌరవం కూడా .. సంవత్సరాలు తరబడి ప్రేమించుకుని డేటింగ్ చేసుకున్నప్పుడు రాని ఇలాంటి గొడవలు ఆలోచనలు కేవలం పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు వస్తున్నాయి అనేది మన పెద్దల వాదన .. అయితే ఎప్పుడు ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న విడాకులు వ్యవహారం గురించి మాజీమంత్రి సినీనటి రోజా షాకింగ్ కామెంట్లు చేశారు.


రీసెంట్గా ఓ యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ విడాకుల వ్యవహారం కేవలం చిత్రపరశ్రమలోనే లేదు .. మిగిలిన అన్ని రంగాల్లో కూడా ఇది తరచూ జరుగుతూనే ఉంది .. పెళ్లైన నెల రోజులకు విడిపోయి వేరే వాళ్ళను మళ్ళీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉన్న వాళ్ళని చాలా మంది చూశాను .. ఈ మధ్యకాలంలో అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు కూడా డబ్బులు సంపాదిస్తున్నారు .. ఒక భార్య భర్త మధ్య ఏదైనా సమస్య వస్తే అతని వైపు తప్పు ఉన్నప్పుడు నేనెందుకు తగ్గాలి నేను కూడా బాగా సంపాదిస్తున్నాను అనే భావన ఇప్పుడున్న భార్యల్లో ఎక్కువైపోయింది .. భర్తల్లో కూడా ఇదే తరహా మెంటాలిటీ ఉండొచ్చు .. ప్రస్తుతం ఇద్ద‌ర‌లో ఎవరూ తగ్గక పోవడం కారణంగానే ప్రస్తుతం సమాజంలో విడాకులు తీసుకునే జంటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి .. అదేవిధంగా ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఒకరితో ఒకరు సర్దుకుని జీవితాన్ని ముందుకు తీసుకు నటనవే సంసారం .. అలా ఒకరితో సర్దుకోలేక విడిపోయిన వాళ్లు మరొకరితో సద్దుకొని ఎలా జీవించగలరు అంటూ.. విడాకులు ఇష్యూ పై తన అభిప్రాయాన్ని తేల్చి చెప్పేసింది.


రోజా తమిళ దర్శకుడు నిర్మాత సెల్వ‌మ‌ణిని 2002లో పెళ్లి చేసుకుంది .. ఈ జంటకి ఒక కొడుకు ఒక కూతురు కూడా ఉన్నారు.. సాధారణంగా ఏ కుటుంబంలోనైనా తమ భార్యల్ని రాజకీయాల్లోకి పంపాలని ఏ భర్త అనుకోరు .. కానీ నా భర్త మాత్రం నాకు ఇష్టం వచ్చినట్టు బ్రతికే స్వేచ్ఛ ఇచ్చారు. తర్వాత రోజా రాజకీయాల్లో ఎదిగి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఎంతో గొప్ప ఎత్తుకి ఎదిగారు .. అయినా కూడా ఆమె భర్తలో ఎలాంటి అసూయ ద్వేషం లేదు .. రోజా గెలుచుకున్న స్థాయితో పోల్చుకుంటే ఆయన భర్త సెల్వమణి స్థాయి ఎంతో తక్కువ .. అయినప్పటికీ కూడా వారి మధ్య ఇన్నేళ్లు ఎలాంటి బేద అభిప్రాయాలు రాలేదు .. ఒకరికి ఒకరు కలిసి మెలిసి ఎంతో అన్యోన్యంగా జీవిస్తున్నారు .. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్తగా పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్లాలని కూడా పలువురు విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: