పాన్ ఇండియా స్టైల్ లో భారీ క్రేజ్ గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో మ్యాన్ ఆఫ్ మాసెస్‌ ఎన్టీఆర్ కూడా ఒకరు .. త్రిబుల్ ఆర్ సినిమాకు ముందు తెలుగు రాష్ట్రానికే పరిమితమైన ఎన్టీఆర్ రాజమౌళితో త్రిబుల్ ఆర్ తర్వాత గ్లోబల్ హీరోగా భారీ క్రేజ్ తెచ్చుకున్నాడు .. ఈ సినిమా తర్వాత వచ్చిన దేవర సినిమాతో సోలో హీరోగా పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ క్రియేట్ చేశాడు .. 500 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి పాన్‌ ఇండియా బాక్సాఫీస్ ను షేక్ చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో కలిసి వార్‌ 2 సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది .. బిగ్గెస్ట్ మల్టీ స్టార్ గా తెర్కక్కుతున్న ఈ సినిమా వచ్చే ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


అయితే ఎన్టీఆర్ సినిమాల విషయం పక్కనబెడితే సోషల్ మీడియాలో ఎన్టీఆర్ గురించి ఏదో ఒక వార్త ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటుంది .. ఇప్పుడు కూడా ఎన్టీఆర్ గురించి సెన్సేషన్ న్యూస్ వైర‌ల్‌ గా మారింది .. గతంలో ఎన్టీఆర్ హోస్టుగా చేసిన మీలో ఎవరు కోటీశ్వరుడు గేమ్ షో ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే .. ఇక ఇందులో ఎన్టీఆర్ క్వశ్చన్లు సినిమాల గురించి కూడా అడిగాడు .. అలా తొలిప్రేమ సినిమాకి సంబంధించిన టాపిక్ వచ్చినప్పుడు నాకు ఎంతో ఇష్టమైన పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఇది కూడా ఒకటి .. అలాగే నేను ఎన్నోసార్లు ఈ సినిమాలు చూశాను .. తొలిప్రేమ సినిమాలోని పాటలు కూడా నాకు ఎంతో ఇష్టమంటూ ఎన్టీఆర్ చెప్పుకొచ్చారట .. అంతేకాకుండా ఎన్టీఆర్ థియేటర్లో చూసిన ఏకైక పవన్ కళ్యాణ్ సినిమా కూడా ఇదేనట.


పవన్ కళ్యాణ్ తొలిప్రేమ వచ్చిన మూడు సంవత్సరాలకు ఎన్టీఆర్ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టాడు .. కెరియర్ మొదట్లో ఆయనకు ఎలాంటి మాస్ ఇమేజ్ వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు .. మూతి మీద సరిగ్గా మీసం రాకముందే చిన్న వయసులోనే చిరంజీవి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలకు పోటీగా మాస్ హీరోగా క్రేజ్ తెచ్చుకున్నాడు .. ఆ తర్వాత ఎన్టీఆర్ సినీ ప్రయాణం గురించి అందరికీ తెలిసిందే. ఎన్టీఆర్ ప్రస్తుతం నటించే సినిమాలు విషయానికి వస్తే వార్‌ 2 తర్వాత ప్రశాంత్ నీల్, దేవరా 2 సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి .. ఈ సినిమాల పై కూడా ఊహించని రేంజ్‌లో అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: