ప్రపంచవ్యాప్తంగా సినిమా లవర్స్ ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ SSMB29.ఈ సినిమా ఇంకా సెట్స్ పైకి వెళ్లకుండానే రూ. 2000కోట్ల బొమ్మ అంటూ అటు ఘట్టమనేని ఫ్యాన్స్ తో మూవీ క్రిటిక్స్ లెక్కలేసుకుంటున్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ కాబట్టి జక్కన్న ఏ రేంజ్ లో తీస్తారో అని సినీ ప్రియులు ఆసక్తిగా ఉన్నారు. ఈ మూవీలో బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కేఎల్‌ నారాయణ తెరకెక్కిస్తున్నారు.తుఫాన్‌ తర్వాత ప్రియాంకా చోప్రా తెలుగులో ఫుల్‌ లెంగ్త్‌ రోల్‌లో నటిస్తున్న మూవీ ఇదే కావడం విశేషం. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీకి ప్రియాంక చోప్రా ఏకంగా రూ. 30 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట.ఇదిలావుండగా ఆమె మహేష్ పక్కన హీరోయిన్ గా నటిస్తుందా.. లేక కీలక పాత్ర పోషిస్తుందా అనే విషయంలో క్లారిటీ లేదు. సూపర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం హీరోయిన్ గా అయితే ఆమె సెట్ అవ్వదేమోనని అభిప్రాయపడుతున్నారు.

అదే సమయంలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని, హీరోయిన్ గా ఇండోనేసియా బ్యూటీ యాక్ట్ చేస్తుందని చెబుతున్నారు. అయితే ఇప్పటికే షూటింగ్ లో పాల్గొంటున్న ప్రియాంక.. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తోంది. తన సోదరుడి సిద్ధార్థ్ చోప్రా వివాహం కోసం విరామం తీసుకున్నట్లు సమాచారం.తాజాగా హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో కనిపించింది. ముంబైకి వెళ్తూ కెమెరాలకు చిక్కింది. అయితే ప్రియాంక బ్రేక్ తీసుకున్నా.. షూటింగ్ మాత్రం కంటిన్యూ అవుతూనే ఉందట. ఆమె లేని సీన్స్ ను జక్కన్న షూట్ చేస్తున్నారని సమాచారం. ఆమె కూడా అతి త్వరలో మళ్లీ సెట్స్ లోకి వచ్చేయనుంది.అలాగే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోయిన్ గా ప్రియాంక చోప్రా ఈ సినిమాతో మారబోతోంది. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుకి కూడా 100 కోట్లకి పైగా రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది

మరింత సమాచారం తెలుసుకోండి: