టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్థాయిలో మోస్ట్ వాంటెడ్ దర్శకులలో లెక్కల మాస్టర్ సుకుమార్‌ కూడా ఒకరు .. రాజమౌళి తర్వాత పాన్ ఇండియా స్థాయిలో అంతటి క్రేజ్‌ తెచ్చుకున్నాడు ఈ లెక్కల మాస్టర్ .. పుష్పా సినిమాలతో త‌నుఎంటో ఇండియన్ బాక్సాఫీస్ కి చూపించాడు .. ఇక ఇప్పుడు వచ్చిన పుష్పా2 సినిమాతో ఏకంగా రాజమౌళి రికార్డులు కాకుండా ఇండియన్ సినిమా రికార్డులు ఎన్నో తన ఖాతాలో వేసుకున్నాడు .. ప్రస్తుతం ఈ లెక్కల మాస్టర్ తన తర్వాత సినిమాని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో చేయబోతున్నాడు.


ఇప్పటివరకు పుష్ప సినిమాతో రెస్ట్ లేకుండా వర్క్ చేసినందుకు కోంత గ్యాప్ తీసుకుని రామ్ చరణ్ తో సినిమాను మొదలు పెట్టబోతున్నాడు . అయితే సుకుమార్ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో.. అసిస్టెంట్ డైరెక్టర్ ఛాన్స్ కోసం మరో అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ ని కలిశారట .. బద్రి , ఇడియట్ , అమ్మానాన్న ఓ తమిళమ్మాయి .. శివ‌మని వంటి విజయాలతో పూరి జగన్నాథ్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు .. పూరికి తెలిసిన ఓ వ్యక్తి సుకుమార్ కి తెలుసట ఆయన రెకమెండ్‌ చేయడంతో పూరి జగన్నాథ్ ని సుకుమార్ కలిసారట ..


అసిస్టెంట్ డైరెక్టర్ గా నాకు మీ వద్ద అవకాశం కావాలని అడిగాడట .. ఆ సమయంలో సుకుమార్‌ని పూరి జగన్నాథ్ ఒక కథ చెప్పమని అడిగారట .. ఈ విషయాన్ని గతంలో పూరి తెర్కక్కించిన లైగ‌ర్ మూవీ ప్రమోషన్లలో సుకుమార్ , పూరి చిట్ చాట్ లో చెప్పుకొచ్చాడు .. అలా సుకుమార్ , పూరి జగన్నాథ్ మధ్య ఎప్పట్నుంచో మంచి రిలేషన్ కొనసాగుతూ వచ్చింది .. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు.. తన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా ఛాన్స్ కావ‌ల‌ని వచ్చిన సుకుమార్ మాత్రం పాన్ ఇండియా స్థాయిలో లో వ‌రుస‌ విజయాలతో దూసుకుపోతున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: