గోపీచంద్ ..ఈ పేరు గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో జనాలు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . దానికి కారణం ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న గోపీచంద్ ఫర్ ద ఫస్ట్ టైం తాను పెట్టుకున్న రూల్స్ బ్రేక్ చేస్తూ తనకు ఇష్టం లేకపోయినా సరే ఒక బిగ్ బడా సినిమాలో విలన్ రోల్ ని యాక్సెప్ట్ చేశాడు అన్న వార్తలు ప్రచారంలోకి రావడమే . మనకు తెలిసిందే గోపీచంద్ విలన్ షేడ్స్  లో బాగా నటిస్తాడు . అయితే ఆయనకు హీరో అవ్వాలని ఆశతో హీరోగానే సెటిల్ అవ్వాలి అనుకుంటూ అలాంటి కంటెంట్ ఉండే సినిమాలను చూస్ చేసుకున్నాడు .


కాగా గోపీచంద్ ఇప్పటికి హీరోగా సక్సెస్ కాలేకపోతున్నాడు . అందుకే ఆయనకు పలు బడా పాన్ ఇండియా  సినిమాలలో విలన్ షేడ్స్ లో ఉన్న పాత్రలను ఆఫర్ చేస్తున్నారు స్టార్ డైరెక్టర్స్ . కానీ ఎవరికి ఆయన ఓకే చెప్పడం లేదు.  బట్ ఫర్ ద ఫస్ట్ టైం తన ఫ్రెండ్ ప్రభాస్ కోసం బిగ్  రిస్క్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు గోపీచంద్. హను రాఘవపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న "ఫౌజి" సినిమాలో విలన్ గా గోపీచంద్ నటించబోతున్నాడట.



సినిమా అగ్రిమెంట్ పేపర్లపై రీసెంట్ గానే సైన్ చేసాడట . ఈ న్యూస్ బయటకు రావడంతో జనాలు షాక్ అయిపోతున్నారు . ప్రభాస్ - గోపీచంద్ మంచి ఫ్రెండ్స్ అన్న విషయం అందరికీ తెలుసు.  అయితే ప్రభాస్ సినిమాల్లో చాలా సార్లు ఆయనకు విలన్ పాత్రల్లో  నటించే ఛాన్స్ వచ్చిన మిస్ చేసుకున్నారు ..రిజెక్ట్ చేశారు . కానీ ఈసారి మాత్రం ఫౌజి కధ  వేరే లెవెల్ లో ఉంటుంది అని ..ఆ కారణంగానే ప్రభాస్ సినిమాలో కనిపించడానికి గోపీచంద్ ఒప్పుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగిపోతుంది . ఈ సినిమాతో మరొకసారి గోపీచంద్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ తెగ ట్రెండ్ చేస్తున్నారు..!

మరింత సమాచారం తెలుసుకోండి: