ప్రస్తుతం ప్రభాస్ తో షూటింగ్లో పాల్గొంటున్న ఇమాన్వి .. ప్రభాస్ తనకోసం పంపించిన ఫుడ్ గురించి సోషల్ మీడియాలో కూడా షేర్ చేసింది .. ఈ పాన్ ఇండియా హీరో తన హీరోయిన్లకు ఫుడ్ పంపించడం ఇది మొదటిసారి కాదు. గతంలో సలార్ మూవీ షూటింగ్ టైంలో ప్రభాస్ ఫుడ్ ఐటమ్స్ గురించి అప్డేట్స్ ఇచ్చారు శృతిహాసన్ .. ఏకంగా 40 రకాల వంటకాలను తనకు రుచి చూపించారంటూ తన ఎగ్జైట్మెంట్‌ను అభిమానులతో పంచుకుంది .. వీరే కాకుండా ప్రభాస్ లంచ్ మెనూకి బాలీవుడ్ స్టార్స్ కూడా ఫిదా అయ్యారు.
ప్రభాస్ హాస్పిటాలిటీ గురించి పలు సినిమా ఈవెంట్లో కూడా మాట్లాడారు బాలీవుడ్ బ్యూటీ దీపిక . అదే విధంగా తనకు కల్కి సినిమా సమయంలో ప్రభాస్ పంపించిన లంచ్ ఐటమ్స్ సోషల్ మీడియాలో కూడా ఈమె షేర్ చేశారు .. దీపికాతో పాటు మరో బాలీవుడ్ బ్యూటీ దిశాకు కూడా ప్రభాస్ తన లంచ్ మెనూ షేర్ చేశాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న'ది రాజాసాబ్' హీరోయిన్లకు కూడా ప్రభాస్ ఆతిథ్యాన్ని తీసుకున్న వారే .. అలాగే ఆదిపురుష్ షూటింగ్ సమయంలో మరో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌తో పాటు ఆ సినిమాలో రావణుడిగా నటించినా సైఫ్ అలీ ఖాన్ భార్య కరీనా కపూర్‌కు కూడా ఈ స్పెషల్ బిర్యానీ పంపించాడు ప్రభాస్ .. తనతో కలిసి సినిమాల్లో నటించే హీరోయిన్లకు తెలుగువారి ఆతిథ్యం ఏంటో దగ్గరుండి చూపిస్తున్నాడు ఈ పాన్ ఇండియా హీరో.