హీరోయిన్ రక్షిత ప్రతి ఒక్కరికి సుపరిచితమే. ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ నటించిన ఇడియట్ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఒకప్పుడు కుర్రకారుల డ్రీమ్ గర్ల్ రక్షిత అని చెప్పవచ్చు. ఈ సినిమాలో తనదైన నటన, అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం మహేష్ బాబు, రవితేజ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి వంటి ఎంతోమంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి ఆకట్టుకుంది.


తెలుగులోనే కాకుండా తమిళంలోనూ కొన్ని సినిమాలలో నటించింది. అక్కడ దళపతి విజయ్ వంటి స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం విశేషం. ఇక ఏమైందో తెలియదు కొన్ని రోజులకు ఈ బ్యూటీ సినిమాలు చేయడం పూర్తిగా మానేసింది. ప్రస్తుతం రక్షిత ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. చాలా బరువు పెరిగింది. తన అందాన్ని కోల్పోయింది. సినిమాలలో హీరోయిన్ గా చేయడం మానేసి నిర్మాతగా సినిమాలు చేయడం ప్రారంభించింది.


కాగా, 2007లో కన్నడ డైరెక్టర్ ప్రేమ్ అనే వ్యక్తిని ఈ బ్యూటీ వివాహం చేసుకుంది. అనంతరం సినిమాలు చేయడం పూర్తిగా మానేసి నిర్మాతగా వ్యవహరించింది. అలాగే టీవీ షోలు చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఇంటర్వ్యూలో కనిపించి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చింది. ఈ వీడియోలో రక్షితను చూసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు. కేవలం 22 ఏళ్లలోనే ఇంతగా మారిపోయావేంటి అసలు గుర్తుపట్టలేనంతగా తయారు అయ్యావు అని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.


ఒకప్పుడు ఎంతో అందంగా, అబ్బాయిల కలల డ్రీమ్ గర్ల్ గా ఉండే దానివి ఇప్పుడేంటి ఇలా అయ్యారు అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం రక్షితకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక కొంతమంది రక్షిత అభిమానులు మళ్లీ మీరు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించండి అని కామెంట్లు చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: