టాలీవుడ్ మెగా పవర్ స్టార్ .. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ... బాలీవుడ్ ముద్దుగుమ్మ కియార అద్వానీ అలాగే అంజలి హీరోయిన్లు గా ... కోలీవుడ్ ఏ వన్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. ఈ సినిమా ఈ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా పై ముందు నుంచి ఉన్న అంచనాలు ఏ మాత్రం అందుకోలేకపోయింది. మరి ఈ సినిమా ఎట్టకేలకు ఓటీటీ ఎంట్రీకి కూడా రెడీ అయిపోతోంది.
ఇక గేమ్ ఛేంజర్ సినిమా ఓటీటీ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. సినిమా థియేట్రికల్ గా ప్లాప్ కావడంతో అమోజాన్ వాళ్లు ముందుగా అనుకున్న దాని కంటే కూడా వేగంగా ఓటీటీ లో రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. గేమ్ ఛేంజర్ ఓటీటీ లోకి వస్తుందన్న వార్తలతో మెగా .. రామ్ చరణ్ ఫ్యాన్స్ మరొకటి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి సినిమా అదనపు నిడివితో రిలీజ్ చెయ్యాలని కోరుతున్నారు.
డైరెక్టర్ శంకర్ చెప్పిన 5 గంటల ఫుటేజ్ పెట్టాలని .. లేని పక్షంలో ఇప్పుడు ఉన్న నిడివి కి తోడు అదనంగా మరి కొంత యాడ్ చేసి ఓటీటీ లో పెట్టాలని .. అది కూడా మంచి గా ఎడిట్ చేసి ఇవ్వాలని .. మేం ఓటీటీలో అప్పుడు సినిమాను ఎంజాయ్ చేస్తామని వారు అంటున్నారు. మరి ఫ్యాన్స్ కోరిక పై ఏమన్నా క్లారిటీ వస్తుందేమో చూడాలి. అలాగే ఓటీటీ రిలీజ్ డేట్ కూడా త్వరలోనే రివీల్ కానుంది. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు.