- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .


అక్కినేని హీరో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా ‘ తండేల్ ’ . ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయ్యిన నేప‌థ్యం లో ప్ర‌మోష‌న్లు అయితే హోరెత్తి పోతున్నాయి. ఇక తండేల్ సినిమా ను దర్శకుడు చందూ మొండేటి డైరెక్ట్ చేస్తుండగా పూర్తి లవ్ స్టోరీ పీరియాడిక్ మూవీగా థియేట‌ర్ల లోకి రానుంది. ఈ సినిమాను GA2 బ్యానర్‌పై బన్నీ వాస్ అత్యంత భారీ బడ్జెట్‌తో చాలా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు.


కాగా, ఈ సినిమాకు భారీ బడ్జెట్ అయ్యింది. నాగ‌చైత‌న్య కెరీర్ లోనే చాలా ఎక్కువ బ‌డ్జెట్ పెట్టిన సినిమా ఇది. ఆ మాట‌కు వ‌స్తే గీతా ఆర్ట్స్ బ‌య‌ట హీరోల తో ఈ స్థాయి బ‌డ్జెట్ పెట్టి సినిమాలు తీయ‌దు. కానీ తండేల్ సినిమా క‌థ మీద న‌మ్మ‌కంతో ఈ సినిమాను నిర్మించారు. తండేల్ సినిమా ఓటీటీ రైట్స్ రూపంలో సగానికంటే ఎక్కువగా రికవర్ అయినట్లు కూడా ఇప్ప‌టికే చిత్ర యూనిట్ తెలిపింది. ఇది మామూలు సెన్షేష‌న‌ల్ కాద‌నే చెప్పాలి. చైతు కు వ‌రుస ప్లాపు లు ఉండి కూడా రిలీజ్ కు ముందే తండేల్ దుమ్ము దులిపేస్తోంది.


తండేల్‌ సినిమా ను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంద‌ని టాక్ ? ఇక తండేల్ సినిమా రిలీజ్ అయిన 50 రోజుల తర్వాతే ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంద‌ట‌. తండేల్ సినిమా కు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా, ఇప్పటికే రిలీజ్ అయిన పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ వ‌చ్చింది. పాట‌లు మార్మోగుతున్నాయి . ఈ సినిమా హిట్ తో అయినా నాగ‌చైత‌న్య ట్రాక్ లోకి వ‌స్తాడేమో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: