టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మొదట ఎన్నో సినిమాలలో కీలక పాత్రలలో నటించిన విజయ్ పెళ్లిచూపులు సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ సినిమాలో తనదైన నటన, ఆటిట్యూడ్ తో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాడు. అనంతరం తెలుగులో వరుసగా సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. కాగా, విజయ్ నటించిన నోట సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా కలెక్షన్లని రాబట్ట లేకపోయింది. ఈ సినిమా థియేటర్ల వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. 

సినిమా 2018 అక్టోబర్, 5న రిలీజ్ అయింది. ఈ సినిమాకు ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా మెహ్రీన్ నటించింది. ఈ సినిమాను వెట్టత్తం అనే నవల ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్ భాషలలో రిలీజ్ చేశారు. దాదాపు రూ. 60 కోట్ల బడ్జెట్ తో నోటా సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు కెఈ జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించారు.

కాగా, నోట సినిమా కేవలం రూ. 25.50 కోట్ల కలెక్షన్లను మాత్రమే కాబట్టి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా అనంతరం విజయ్ నటించిన కొన్ని సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. కొన్ని సినిమాలు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండ షార్ట్ బ్రేక్ తీసుకున్న అనంతరం ఒకేసారి మూడు సినిమాలను లైన్లో పెట్టేసాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ స్పై గా నటిస్తున్నారు. ఈ సినిమా పీరియాడిక్ జానర్ లో తెరకెక్కనుంది.

ఇప్పటి వరకు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్న విజయ్ దేవరకొండసినిమా కోసం పూర్తిగా మేకోవర్ అవడం విశేషం. ఎస్ వి సి బ్యానర్ లో తెరకెక్కుతున్న "వీడి 13" సినిమా కూడా పీరియాడిక్ యాక్షన్ డ్రామాగానే ప్లాన్ చేస్తున్నారు. రివేంజ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వింటేజ్ మాస్ యాక్షన్ హీరోగా విజయ్ దేవరకొండ కనిపించనున్నాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: